Drugs Kingpin Arrested: కీలక ఘట్టం.. డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.!

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక ఘట్టం వెలుగు చూసింది.

  • Written By:
  • Updated On - November 6, 2022 / 10:11 AM IST

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక ఘట్టం వెలుగు చూసింది. మోస్ట్ వాంటెడ్ అయిన డ్రగ్స్ కింగ్‌పిన్ ఎడ్విన్ న్యూన్స్‌ (45)ను గోవాలో అరెస్ట్ చేశారు. ఎడ్విన్‌ని అరెస్ట్ చేసేందుకు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించిన అధికారులు.అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎడ్విన్‌పై గోవాలో నాలుగు, హైదరాబాద్‌లో మూడు కేసులు ఉన్నాయి. సోనాలి ఫోగట్ హత్య కేసులో కూడా ఎడ్విన్ నిందితుడిగా ఉన్నాడు. నిందితుడిపై హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

ఎడ్విన్‌ పై గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్‌లో ఐదు క్రిమినల్ కేసులు, హైదరాబాద్‌లో మూడు కేసులు డ్రగ్స్ సరఫరాకు సంబంధించినవి నమోదు అయ్యాయి. ఎడ్విన్‌ కి 50 వేల మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అందులో 1200 మంది తెలంగాణకు చెందిన కస్టమర్స్ ఉన్నట్టు తేలింది. కొకైన్, ఎక్స్టసీ పిల్స్, LSD బ్లాట్స్, MDMA, బ్రౌన్ షుగర్, హాష్ ఆయిల్, ఇతర డ్రగ్స్ ని తన ఏజెంట్ల ద్వారా తన క్లయింట్‌కు సరఫరా చేస్తుంటాడు.డ్రగ్స్ ద్వారా వందల కోట్లు డబ్బు సంపాదించిన ఎడ్విన్ కు గోవాలో మూడు వీలాసవంతమైన ఇళ్లను నిర్మించుకున్నాడు అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు.

హైదరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్లీస్‌ షాక్‌ రెస్టారెంట్‌లో ఎడ్విన్‌ ఏజెంట్ల ద్వారా పార్టీలు నిర్వహించి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే కింగ్‌పిన్‌. అతను తన రెస్టారెంట్‌లో సంగీతాన్ని ప్లే చేసే ప్రసిద్ధ DJలతో పార్టీలను కూడా నిర్వహించాడు. చాలా మంది పర్యాటకులు, కస్టమర్‌లను ఆకర్షించాడు. దాని ద్వారా రెస్టారెంట్‌లోని సందర్శకులకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఎడ్విన్ తక్కువ ధరకు బల్క్ సప్లయర్ల నుంచి డ్రగ్స్‌ని సేకరించి గోవాలో ఎక్కువ ధరలకు కస్టమర్లకు సరఫరా చేశాడని ఆనంద్ తెలిపారు.

గోవాలో అత్యధిక టూరిస్ట్ సీజన్‌లో ఎడ్విన్ టెక్నో మ్యూజిక్ పార్టీలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి రూ. 3000 నుండి రూ. 5000 వరకు ప్రవేశ రుసుము వసూలు చేశాడు. తన ఏజెంట్ల ద్వారా గోవాలోని అంజునా బీచ్‌లో వినియోగదారులకు నార్కోటిక్ డ్రగ్స్ సరఫరా చేశాడని విలేకరుల సమావేశంలో ఆనంద్‌కు తెలిపారు. తెలంగాణలో దాదాపు 1200 మందికి ఎడ్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు వారిని గుర్తించే పనిలో ఉన్నారు.