Site icon HashtagU Telugu

12 Crore Rupees Car: రూ.12కోట్ల ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వైరల్ అవుతున్న ఫోటోలు

12crore Car

12crore Car

కార్లు అంటే చాలామందికి మక్కువ ఉంటుంది. మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త కారు గురించి , టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి నేటి యువత ఆసక్తి చూపిస్తారు. అయితే హైదరాబాద్కు చెందిన నసీర్ ఖాన్ అనే యువకుడు స్ట్రాటజీ మాత్రం ఇందులో డిఫరెంట్ గా ఉంటుంది. నచ్చిన కారుని ముందు వెనక చూడకుండా ఆగమేఘాల మీద కొనేశాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా…కారు విలువ 10 లక్షలు 15 లక్షలు కాదు.. అక్షరాల 12 కోట్లు.

మెక్ లారెన్ 765 ఎల్ టీ ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన కొత్త మోడల్ కారు. మెక్ లారెన్ షో రూమ్ ఈ మధ్యనే హైదరాబాదులో ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంపెనీ తరఫున మార్కెట్లోకి విడుదలైన కొత్త మోడల్ 765 ఎల్ టీ కార్ తోతను తీసుకున్న ఫోటోలను నసీర్ ఖాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇప్పటివరకు దేశం మొత్తం మీద ఈ కంపెనీ విక్రయించిన రెండు కార్లలో ఒకటి కలకత్తా కి సంబంధించిన వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. రెండవది హైదరాబాద్ కు చెందిన నసీర్ ఖాన్ సొంతం చేసుకున్నాడు.

సోషల్ మీడియాలో నజీర్ ఖాన్ షేర్ చేసిన అతని కొత్త కార్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. నసీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ సూపర్ కార్ మెక్‌లారెన్ 765 LT స్పైడర్ వెర్షన్ కు చెందడంతో పాటు, ఇది అన్ని GT ల లోకి అత్యంత ఖరీదైనది.

నసీర్ ఖాన్ హైదరాబాద్ లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. అతనికి కార్ కలెక్షన్ ఒక పెద్ద హాబీ. ఎప్పటికప్పుడు తన కొత్త కార్ల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అతనికి బాగా అలవాటు. ఈ కొత్త కార్ని అతనికి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ దగ్గర డెలివరీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్యాలెస్ దగ్గర తన కార్ తో ఫోటో దిగిన నసీర్ ఖాన్ ” వెల్కమ్ హోమ్ MCLAREN 765LT స్పైడర్ . ఈ అందమైన కారుని అంతకంటే అందమైన ప్రదేశంలో డెలివరీ తీసుకున్నాను!”అన్న క్యాప్షన్ తో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అతని ఈ పోస్ట్ కి అభిమానుల నుంచి రెస్పాన్స్ కూడా భారీగానే ఉంది.

Exit mobile version