Hunger India : ఆక‌లి కేక‌ల భార‌త్‌, మోడీ హ‌యాంలో రెట్టింపు

ఆక‌లి చావులు భార‌త్ లో(Hunger India) పెరుగుతున్నాయంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.

  • Written By:
  • Updated On - March 8, 2023 / 03:25 PM IST

ఆక‌లి చావులు భార‌త్ లో(Hunger India) పెరుగుతున్నాయంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ(Modi) బాధ్య‌త‌లు స్వీక‌రించే నాటికి ఆక‌లి చావుల ప‌ట్టిక‌లో 55వ స్థానంలో ఉన్న భార‌త్ ఇప్పుడు 107 స్థానికి వెళ్లింది. అంటే, ఆక‌లి చావులు రెట్టింపు అయ్యాయ‌ని ప్ర‌పంచ ఆక‌లి చావుల ప‌ట్టిక చెబుతోంది. భారత దేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన దేశంగా చెబుతుంటారు. ఉచితంగా రేషన్ అందుతున్నా ఆకలి కేకలు ఎందుకు వినిపి స్తున్నవి ? 2014 లో భారత్ ఆకలు సూచిలో 55 వ స్థానం లో ఉండగా , 2022 వచ్చే సమయానికి 107 వ స్థానానికి దిగజారింది. దక్షిణాసియా దేశాలన్నింటిలోకీ చివరి స్థానంలో భారత్ ఉందంటే, చాలా విచారించ దగ్గ విషయం.

ఆక‌లి చావులు భార‌త్ (Hunger India)

40 కోట్ల ఎకరాలు సాగుభూమి ఉన్న భారత్ లో(Hunger India) సాగుకు , తాగు నీటికి 35 వేల టి.ఎం.సి లు అవసరం ఉంటే , అదిపోను ఇంకా అదనంగా 35 టి.ఎం.సి లు సముద్రం పాలవుతున్నాయి. అంత నీరు సముద్రం పాలవుతున్నా నీటి వివాదాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి గానీ తగ్గడం లేదు. మన గోదాముల్లో మూడు సంవ‌త్స‌రాల‌కు సరిపడా ఆహార ధాన్యాల నిలవలు మూలుగు తున్నాయి. కరోనా కష్ఠ కాలంలో ఈ తిండి గింజలే దేశాన్ని ఆదుకున్నాయి. ఒక ప‌క్క పంట దిగుబడులు పెరుగుతూ ఉంది . దీన్ని ఏదో ఒక విధంగా ఆపాలని ఉత్పత్తిని ఆపాలని కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తేవాలని చూసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి ఇస్తే భారత్ ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్య వచ్చు. ఎగుమతులు చేసి నప్పుడు ఇక్కడి గోదాములు ఖాళీ అవుతాయి . రైతు కొత్తగా పంట పండించి మరలా గోదా ములను నింపవచ్చు. అంటే రైతుకు , వ్యవసాయ శ్రామికు లకు నిరంతరం పని దొరుకుతుంది. అటు ప్రభుత్వా నికి(Modi) , ఇటు రైతులకు ఉభయ తారకం అవుతుంది . కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది .

ఆహార ధాన్యాల నిల్వ ఉంచే వ్యవస్థ మాఫియా చేతిలో

ఆహార ధాన్యాల నిల్వ ఉంచే వ్యవస్థ మాఫియా చేతిలో (Hunger India)ఉంది . ధరలు పెంచేది, తగ్గించేది అదే . దాని కోసం ఈ ప్రభుత్వాలు పని చేస్తున్నాయ‌ని చాలా మందికి తెలుసు. గుత్తాధిపత్యం వహించే ఒకరిద్దర్ని దారిలోకి తెచ్చు కుంటే డబ్బులు చేతులు మారడం తేలిక . అందుకే అదాని , అంబానీ లాంటి వారి గుత్తాధిపత్యం కింద దేశాన్ని తాకట్టు పెట్టడానికి మన నాయకులు తయారవుతున్నారు. మనవి సంక్షేమ ప్రభుత్వాలని డప్పు కొట్టు కుంటున్నాము. పత్రికల్లో కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రకటనలు ఇచ్చు కుంటున్నాము. స్వయం సమృద్ధి ఉన్నప్పుడు మరి ఆకలి చావులు O ఉండాలి. యునిసెఫ్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార ప్రోగ్రాం సంస్థ, ఇంటర్ నేషనల్ ఫండ్ ఫర్ ఎగ్రికల్చర్ డెవలప్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ప్రక టించిన నివేదికలో 2019 – 21 మద్య కాలంలో భారత్ లో 56 కోట్ల మంది అంటే 40 % మంది మితమైన లేక తీవ్ర ఆహార కొరతను(Hunger India) ఎదుర్కొంటు న్నారని చెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆహారంలేని వారిలో 37 % ఒక్కభారత్ లో (Modi)

ప్రపంచ వ్యాప్తంగా సురక్షిత ఆహారంలేని వారిలో 37 % ఒక్క భారత్ లో (Hunger India)ఉన్నారని ఆ నివేదికలో పొందు పరచారు. ఇందులో మనం ఏ ప్రభుత్వాలనీ తప్పు పట్టవద్దు. పోనీ జనాభా ఎక్కువ మంది ఉన్నారు , అందువల్ల అందరికీ అందించలేక పోతోందా అంటే ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ జనాభా గల చైనా ఆహార భద్రతలో అత్యున్నత స్థానంలో ఉంది. అది ఎలా చైనాకు సంభవ మైనది ? ప్రభుత్వాలు దీని గురించి ఆలోచిస్తే మంచిది . ఎంతసేపూ సరిహద్దు బూచి చూపించి ఓట్లు దండుకోవడమే గాని పొరుగున ఉన్న చైనా ఎలా తన ప్రజలకు ఆహారాన్ని అందిస్తోందో తెల్సుకో లేని స్థితిలో మన ప్రభుత్వాలు(Modi) ఉన్నాయా ? ఇంటర్నెట్ , సెల్ ఫోన్ లు ఎక్కువ ఉన్న దేశం భారత్ . ఇలా మీట నొక్కితే చైనా ప్రజల జీవన విధానం , అక్కడి నాయకుల పని విధానం క్షణంలో తెల్సి పోతుంది .

Also Read : PM Narendra Modi: మోదీని అధికారం నుంచి దించాలని చూస్తున్న ఇంగ్లండ్, అమెరికా..!

1960 లో భారత్ ఆహార కొరతను (Hunger India)ఎదుర్కొంది. అప్పుడు స్మామినాధన్ నేతృత్వంలో హరిత విప్లవం మొదలైనది. నూతన వంగడాలు కనుగొన బడి , స్వయం ఉత్పాధకతను సాధించారు మన రైతులు. అయినా నేటికీ తినడానికి సరైన తిండి లేక ఎక్కడ బడితే అక్కడ అడుక్కుంటూనే ఉన్నారు. ప్రతిరోజూ 20 కోట్ల మంది ఆకలితో జీవిస్తున్నారని జాతీయ ఆరోగ్య సంస్థ నివేదిక ఇచ్చింది . అందరికీ ఉచిత రేషన్ ఇస్తుంటే ఎందుకు ఆకలి కేకలు ఉంటున్నాయో ఏ ప్రభుత్వాలూ(Modi) పట్టించు కోవడం లేదు. ఇక ఎ.పి లో అయితే అన్న కాంటీన్ల రగడ అంతా , ఇంతా కాదు. సరిపడి నంతగా రేషన్ అందిస్తున్నా ఎందుకని అన్న క్యాంటీన్లకు జనం ఎగ బడుతున్నారు ? ప్రభుత్వాలు సన్న బియ్యం అందిస్తున్నామని కోట్లు పెట్టి కడుపు నిండా భోజనం అని ప్రకటనలు ఇస్తోంది . అసలా సన్న బియ్యంలో ఏమైనా పోషకాలు ఉన్నాయా ? ఉత్త చెత్త తింటున్నట్లు లెక్క .

ప్రభుత్వం దోపిడీకి (Hunger India)

ఒక సాకుగా ప్రజల ఆరోగ్యాలతో చలగాటం మాడుతోంది , తెల్లటి సన్నటి బియ్యం పేరు చెప్పి . తినడానికి సరిపడి నంత తిండే ముఖ్యం కాదు. అది పౌష్ఠికతతో ఉందా , లేదా అనేది కూడా చూడాలి . ఆహారం అనేది కడుపు నిండ డానికి కాదు . శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ అందులో ఉండాలి . అలా లేక ప్రతి సం.రం భారత్ లో 3 లక్షల మంది బాలలు మరణిస్తున్నారు. పౌష్ఠి కాహారం అంటే పాలు, గుడ్లు, మాంసం , పాలు , కూరలు లాంటివి ఉండాలి . ఇవన్నీ భారత్ లో విస్తారంగా దొరుకు తాయి. క్షీర విప్లవం తరువాత పాల ఉత్పత్తిలో 20 కోట్ల టన్నులతో భారత్ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానం , కోళ్ళ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాం. మరి ఇంతలా స్వయం సమృద్ధి సాధిస్తే పోషకాహార సూచిలో భారత్ ప్రపంచ అగ్ర స్థానంలో ఉండాలి. లేక పోవడానికి కారణం పేదరికం అని చెప్పి తప్పించు కుంటున్నాయి (Modi)ప్రభుత్వాలు.

ధరలు పెరుగుదల వల్ల పేదలు కొనుగోలు శక్తి లేక

ధరలు పెరుగుదల వల్ల పేదలు కొనుగోలు శక్తి లేక పోషకాహార లోపానికి (Hunger India) గురవుతున్నారని చెబుతున్నారు. ఒక పక్క ధాన్యం , పాలు , గుడ్లు , మాంసం అందించే రైతులు మాకు గిట్టుబాటు ధరలు లేవు మొర్రో అని వారు గోల చేస్తున్నారు. మూడో ప్రపంచ దేశాల్లో పిల్లల ఎదుగుదల లోపం 20 % తో భారత్ ముందు వరసలో ఉందని ప్రపంచ లెక్కలు చెబుతుండగా , అందుకోసమే అంగన్ వాడీ కేంద్రాలు నెల కొల్పి పోషకాహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోషకాల లోపం ఎక్కువుగా ఆదివాశీలు, గిరిజనులు , పారిశ్రామిక మురికి వాడల్లో కనిపిస్తోంది.

ప్రతిరోజూ 20 కోట్ల మంది ఆకలితో జీవిస్తున్నారని..

వరి , గోధుమల వల్ల పోషకాలు తగినంత అందవు. నూనె గింజలు , పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెంచుకోవాలి. ఐక్యరాజ్య సమితి 2025 కల్లా పౌష్ఠికాహార లోపాన్ని రూపుమాపాలని లక్ష్యాలుగా పేర్కొంది. 2030 కల్లా ” జీరో హంగర్ ” ప్రపంచం అవ్వాలని నిర్దేశ్యించింది . మూడు సంవ‌త్స‌రాల్లో సగం జనాభాకు ఆకలి , పౌష్ఠికత లోపం నుండీ బైటవేయడం సాధ్యమవుతుందా ? ఒక పక్క దమ్ముగా ధాన్యం పండించే రైతులు ఉన్నారు , మరో పక్క పాలు , గుడ్లు , మాసం సృద్ధిగా అందించే రైతులు ఉన్నారు , ఇంకో పక్క సమృద్ధిగా నీరు – రవాణా సౌకర్యం ఉంది , తగినంతగా శ్రామిక శక్తి ఉంది . లేనిదల్లా రాజకీయ లక్ష్యమే . ఇప్ప‌టికైనా నికార్సైన రాజ‌కీయం చేస్తే భార‌త్ బాగుప‌డుతుంది. లేదంటే, ఆక‌లి చావుల(Hunger India) ర్యాంకు మ‌రింత పెరిగే ప్రమాదం లేక‌పోలేదు.

Also Read : Modi: పాకిస్తాన్‌కు మోదీ కావాలి… నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో!