Human Nails: మనిషి చనిపోయిన తర్వాత కూడా గోళ్ళు, వెంట్రుకలు పెరిగే అవకాశం ఉందా?

మనిషి గోళ్ల విషయంలో కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి

  • Written By:
  • Publish Date - December 14, 2022 / 09:42 PM IST

మరణం తర్వాత మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దాంతోపాటే మెదడులోని కణాలు కూడా చనిపోతాయి. కానీ శరీరంలో కొన్ని కణాలు మాత్రమే ఆక్సిజన్ ని ఉపయోగించి పెరిగే సామర్థ్యం కలిగి ఉంటాయని కొందరి అభిప్రాయం. అలా కొంతకాలం పాటు మనిషి చనిపోయిన గోళ్ళు ,వెంట్రుకలు పెరుగుతాయట.

వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ లో ఇలా చనిపోయిన మనిషికి గోళ్ళు, జుట్లు పెరుగుతున్నాయని ఫోటోలు ,వీడియోలు ,పోస్ట్లు చూస్తూ ఉంటాం. అది అబద్ధమని లేదు ఏదన్నా గ్రాఫిక్ తో అలా చేశారని చాలా సార్లు కొట్టి పారేస్తాము. కానీ నిపుణుల పరిశోధన ప్రకారం ఇలా జరిగే దానికి ఆస్కారం ఉంది అని తేలింది.

మనిషి మరణించిన తర్వాత క్రమంగా శరీరం , గుండే పనిచేయడం ఆగిపోతాయి. వెంటనే శరీరంలోని రక్తం కూడా చల్లబడి గడ్డ కట్టడం మొదలు పెడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో చనిపోయిన మనిషి గోళ్ళు, వెంట్రుకలు నిజంగా పెరుగుతాయా? అని మనకు అనుమానం రావడం ఎంతో సహజం.

సైన్స్ ప్రకారం ఇలా సంభవించే దానికి అవకాశం ఉంది. చనిపోయిన తర్వాత శరీరం మొత్తం ఎండిపోతుంది. వేళ్ళు మెలిపెట్టినట్టుగా వంకరగా అవ్వడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో గోళ్ళు పొడుచుకు వచ్చినట్లుగా కనిపిస్తాయి. మరోపక్క జుట్టు కూడా పెరుగుతున్న భావన కలుగుతుంది. కానీ ఇలా గోళ్ళు, జుట్టు పెరగడం అనేది కేవలం కొద్దిసేపు మాత్రమే జరిగే ప్రక్రియ తప్ప సంవత్సరాల తరబడి జరుగుతూ ఉండదు. బ్రెయిన్ డెడ్ అయిన కొంత సమయం వరకు గోళ్ళు, వెంట్రుకలు పెరిగే ఆస్కారం ఉంది. కానీ ఆ తర్వాత శరీరంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. వెంటనే కొద్దిసేపటికి జుట్టుతో పాటు గోళ్ళు కూడా పెరగడం ఆగిపోతుంది.

మన చుట్టూ జరుగుతున్న విషయాలు ఒక్కొక్కసారి నమ్మశక్యంగా సైన్స్ పరంగా కొన్ని సందర్భాల్లో ఇలాంటివి నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.