Site icon HashtagU Telugu

Srinagar Explosions: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు‌పై పాక్ దాడి.. దాల్‌ లేక్‌లో మిస్సైల్ పేలుడు

Srinagar Airport Explosions Jammu Kashmir Pakistan India

Srinagar Explosions:  భారత్‌ను కవ్వించడమే లక్ష్యంగా ఈరోజు (శనివారం) కూడా పాకిస్తాన్ ఆర్మీ తెగబడింది. ఇవాళ ఉదయం 11.45 గంటల సమయంలో జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి యత్నించింది. దీంతో విమానాశ్రయం పరిసరాల్లో 2 భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈనేపథ్యంలో శ్రీనగర్‌లో(Srinagar Explosions) సైరన్లు మోగిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో  భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు.

Also Read :Pakistan Attack: 26 ప్రదేశాల్లోకి పాక్ డ్రోన్లు.. నాలుగు ఎయిర్‌బేస్‌లపై దాడి

దాల్ లేక్‌లోకి పాక్ మిస్సైల్.. భారీ పేలుడు

జమ్మూ కశ్మీరులోని శ్రీనగర్‌లో ఉన్న దాల్ లేక్ అనేది ప్రఖ్యాత టూరిజం సెంటర్. దాల్ లేక్‌లో పాకిస్తాన్ మిస్సైల్ పడటంతో.. దానిలో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు దాల్ లేక్ నుంచి మిస్సైల్ శకలాలను తొలగించారు. శ్రీనగర్ శివార్లలో ఉండే  లాస్జన్ ఏరియాపైనా మిస్సైల్ దాడి జరిగినట్లు సమాచారం. ఆయాచోట్ల భద్రతా బలగాలు హైఅలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. అంతకుముందు ఈరోజు(శనివారం) ఉదయం కూడా శ్రీనగర్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం భారత వాయుసేన ఆధీనంలో ఉంది.  పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో భారత సర్కారు అలర్ట్ అయింది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న 32 ఎయిర్‌పోర్టులను మూసేసింది. మే 15 వరకు ఆయా ఎయిర్‌పోర్టుల మూసివేత కంటిన్యూ అవుతుందని కేంద్ర సర్కారు వెల్లడించింది.

Also Read :Operation Sindoor Movie : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పోస్టర్.. సారీ చెప్పిన దర్శకుడు.. ఎందుకు ?

భారత సరిహద్దుల దిశగా పాక్.. 

ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దుల దిశగా కదులుతోందని ఈరోజు మీడియా సమావేశంలో  భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు.  ఈవిధంగా పాకిస్తాన్ చేయడం అనేది పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదకర చర్య అని ఆయన పేర్కొన్నారు. భారత సైనిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్‌ స్టాంప్‌లు ఉన్న వీడియోలు, ఫొటోలను ప్రదర్శించారు.