Aadhar Card: కార్డులో ఇలా ఈజీగా డేట్ అఫ్ బర్త్ మార్చుకోండి.. పూర్తి వివరాలివే!

భారతదేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. చిన్నపిల్లల నుంచి పెద్దల ప్రతి ఒక్కరికి

  • Written By:
  • Publish Date - August 7, 2022 / 09:45 AM IST

భారతదేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. చిన్నపిల్లల నుంచి పెద్దల ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలా ఆధార్‌ ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాల పనుల నుంచి చిన్న చిన్న పనుల వరకు జరుగుతాయి. లేకుంటే నిలిచిపోతాయి. మరి అటువంటి ఆధార్ కార్డులు మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఏం చేయాలి? ఆన్లైన్లో ఏ విధంగా సరిచేసుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ సరి చేసుకోవడానికి ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాల్సిందే. ఒకవేళ ఇది లేకపోతే ప్రత్యామ్నాయంగా పాస్ పోర్ట్, పాన్ కార్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఐండెంటిటీ కార్డు సైతం చెల్లుబాటవుతాయి.

అయితే డేట్ ఆఫ్ బర్త్ కోసం సమర్పించాల్సిన పూర్తి వివరాలను https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf ఈ లింక్ కు వెళ్లి తెలుసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ను మార్చుకునేందుకు ఆధారంగా జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కనుక దాని సాఫ్ట్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం https://myaadhaar.uidai.gov.in/ పేజీకి వెళ్ళి ఆధార్ నంబర్, క్యాపెచా కోడ్ నమోదు చేసిన తర్వాత సబ్ మిట్ కొడితే, అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఆ తరువాత అప్ డేట్ ఆధార్ ఆన్ లైన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, అప్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ కు వెళ్లాలి. అప్పుడు పేరు, జెండర్, భాష, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లో ఏది అప్ డేట్ చేసుకోవాలన్న ఆప్షన్ లు కనిపిస్తాయి. అప్పుడు మనకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడే ఆధారంగా డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేసి సబ్ మిట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇందుకు రూ.50 చార్జీ చెల్లించాలి. అయితే ఈ అప్డేట్ ప్రక్రియ అంతా కూడా నెల రోజుల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన వివరాలకు, డాక్యుమెంట్ లోని వివరాలకు ఏమైనా వ్యత్యాసం ఉంటే రిజెక్ట్ అవుతుంది. అయితే రెండో సారి డేట్ ఆఫ్ బర్త్ లో కరెక్షన్ చేసుకోవాలంటే ఆన్ లైన్ లో సాధ్యపడదు. దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్లే సమయంలో కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.