Site icon HashtagU Telugu

Sambhal : ప్రతిపక్ష నేత రాహుల్ ను ఎలా అడ్డుకుంటారు – ప్రియాంక ఫైర్

Rahul Ghazipur

Rahul Ghazipur

యూపీలోని సంభల్‌(Sambhal)లో జరిగిన అల్లర్ల (Uttar Pradesh’s violence-hit) కారణంగా రాహుల్ గాంధీ (Cong MP Rahul Gandhi) చేపట్టిన పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ (MP sister Priyanka) కూడా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఘాజీపూర్ సరిహద్దులో వారిని పోలీసులు నిలిపివేశారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రియాంక గాంధీ పోలీసుల తీరును ప్రశ్నించారు.

సంభల్‌లో మసీదుకు సంబంధించిన వివాదంతో చోటుచేసుకున్న అల్లర్లు ఐదుగురు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ పరిణామాలను సమీక్షించేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం అక్కడికి బయలుదేరగా.. శాంతి భద్రతల పరిరక్షణ పేరిట పోలీసులు ఆయన పర్యటనకు అనుమతించలేదు. దీంతో ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యంలో తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకోవడం తప్పా? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవడం అనైతికమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతలు ఈ చర్యలను అధికార యూపీ ప్రభుత్వ కుట్రగా అభివర్ణిస్తున్నారు ప్రభుత్వ వర్గాలు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలేనని సమర్థించుకుంటున్నాయి. ఈ వివాదం ప్రతిపక్ష నేతల హక్కులపై దృష్టి సారించేలా చేస్తోంది. సంభల్‌లోని పరిస్థితులు సానుకూలంగా మారాలంటే, ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. బాధిత కుటుంబాలకు మద్దతు అందించడంలో రాజకీయాలు పక్కనపెట్టి కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది.

Read Also : Pushpa 2 : ఫ్యాన్స్ తో కలిసి ‘పుష్ప-2′ చూడబోతున్న అల్లు అర్జున్