QR Code E- Pan Card: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించింది. క్యూఆర్ కోడ్ ఆధారంగా కొత్త పాన్ కార్డులు జారీ చేసే ప్రాజెక్టుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పన్ను చెల్లింపుదారులు తమ పాత అడ్రస్‌ను కొత్త పాన్ కార్డులో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగంలో అడ్రస్ మార్పును నమోదు చేసిన తర్వాత, క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇ-పాన్ కార్డును ట్యాక్స్ పేయర్ల రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి పంపిస్తారు. అలాగే, పాన్ కార్డుదారులు రూ.50 చెల్లించి కొత్త కార్డులను ప్రింట్ చేసుకోవచ్చని తెలియజేశారు.
పాన్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేయడం చాలామంది పట్టించుకోరు. అయితే, పాన్ కార్డుపై అడ్రస్ ప్రింట్ లేకపోతే, దాన్ని అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించడం సాధ్యం కాదు. అంతేకాక, పాన్ కార్డులో అడ్రస్ లేదు అంటే, ఇన్‌కమ్ ట్యాక్స్ రికార్డుల్లో ఆ అడ్రస్ కూడా అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
సరైన అడ్రస్ ఉన్న పాన్ కార్డు ఉండడం చాలా అవసరం. ఆధార్ ఆధారంగా ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్డేట్ చేయడం సులభం. పన్ను చెల్లింపుదారులు NSDL వెబ్‌సైట్‌ను సందర్శించి (https://www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html) ఉచితంగా తమ అడ్రస్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే, పాన్ కార్డు యూటీఐ ఐటీఎస్ఎల్ ద్వారా జారీ చేయబడితే, అడ్రస్ అప్డేట్ కోసం (https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange) లింక్‌ను ఉపయోగించవచ్చు.
ఎన్ఎస్‌డీఎల్ ద్వారా కొత్త పాన్ కార్డ్ ఎలా పొందాలి?
- ముందుగా NSDL ఇ-పాన్ పోర్టల్కు పై చెప్పిన లింక్ ద్వారా వెళ్లాలి.
- హోమ్ పేజీలో, మీ పాన్ కార్డ్, ఆధార్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేసి, “ఆధార్ ఆధారిత అప్డేట్” ఆప్షన్‌ను టిక్ చేసి, “సబ్మిట్” చేయాలి.
- తర్వాత, కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడీకి ఓటీపీ పంపబడుతుంది. ఆ ఓటీపీని ఉపయోగించి ఆధార్ ఆధారిత ఇ-కేవైసీని జనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, “కంటిన్యూ విత్ ఇ-కేవైసీ” పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, “సబ్మిట్” చేయాలి.
- ఇన్‌కమ్ ట్యాక్స్ రికార్డుల్లో ఉన్న మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్‌ను అప్డేట్ చేసుకునేందుకు ఆప్షన్ కనబడుతుంది. మీరు మార్పు చేసాలనుకుంటే, కొత్త నంబర్ మరియు ఇ-మెయిల్‌ను ఎంటర్ చేయవచ్చు. మార్పులు చేసిన తర్వాత, కొత్త మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపబడుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి, మీ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడీని అథెంటికేట్ చేయాలి.
- తర్వాత, ఆధార్‌కు సంబంధించిన అడ్రస్ వివరాలు మాస్క్‌డ్ రూపంలో కనిపిస్తాయి. మీరు వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత, “వెరిఫై” పై క్లిక్ చేయాలి.
- కొత్త వెబ్ పేజీకి వెళ్తుంది. “అడ్రస్ అప్డేట్” పై క్లిక్ చేయాలి. దీనివల్ల, ఉచితంగా మీ అడ్రస్ అప్డేట్ అవుతుంది.
- ఒకసారి అడ్రస్ అప్డేట్ చేసిన తర్వాత, మీ ఇ-మెయిల్ ఐడీకి ఇ-పాన్ కార్డ్ పంపించబడుతుంది.
- మీరు రూ.50 చెల్లించినట్లయితే, పాన్ కార్డ్‌ను ప్రింట్ చేసి మీకు పంపిస్తారు.