సాధారణంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనగానే డ్రైవింగ్ లైసెన్స్ కార్డు గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కార్డుతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాఫీ నీ కూడా మన ఫోన్ లో పెట్టుకోవచ్చట. ఇలా పెట్టుకోవడం కూడా చాలావరకు సురక్షితం, సౌకర్యం అని అంటున్నారు. అయితే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఫోటో తీసి ఫోన్ లో పెట్టుకోవచ్చు కదా అని అంటే పెట్టుకోవచ్చు కాకపోతే అది ఫోటో కాపీ మాత్రమే. అదే డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అసలైన కాపీ అవుతుంది. ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ మాదిరిగానే ఈ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెల్లుబాటు అవుతుందట.
అయితే ఈ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఆన్ లైన్ లో పరివాహన్ సేవా వెబ్ సైట్ లేదంటే డిజీలాకర్ వెబ్ సైట్ లేదా డిజీలాకర్ మొబైల్ యాప్ ను ఉపయోగించుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చట. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న వివరాల్లోకి వెళితే.. మొదట పరివాహన్ సేవా (https://parivahan.gov.in/) వెబ్ సైట్ లోకి వెళ్ళి, ఆన్ లైన్ సర్వీసెస్ సెక్షన్ లో డ్రైవర్స్ లైసెన్స్ రిలైటెడ్ సర్వీసెస్ ఆప్షన్ ను ఎంచుకొని, ఆ తరువాత స్టేట్ ని ఎంచుకోవాలి. అనంతరం డ్రైవింగ్ లైనెస్స్ సెక్షన్ లో ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని దరఖాస్తును పూర్తి చేయాలి. ఆ తరువాత దానిని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు.
ఆ తరువాత డీజీలాకర్ పోర్టల్ పై (https://digilocker.gov.in/) లాగిన్ అయ్యి సెర్చ్ డాక్యుమెంట్స్ ను క్లిక్ చేసి ఆ పేజీ యొక్క పై భాగంలో ఎడమ చేతివైపు ఉండే డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ పై ట్యాప్ చేసి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేసి.. గెట్ ద డాక్యుమెంట్ పై క్లిక్ చేయగా అక్కడ మనకు డ్రైవర్స్ లైసెన్స్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ పై ట్యాప్ చేయాలి. ఆ తరువాత ఇక ఫోన్ లో డిజీలాకర్ యాప్ ను తెరవాలి. డాక్యుమెంట్స్ యూ మైట్ నీడ్ సెక్షన్ పై క్లిక్ చేసి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేసి గెట్ ద డాక్యుమెంట్ పై క్లిక్ చేయాలి. డ్రైవర్స్ లైసెన్స్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీని తీసుకోవచ్చు.