PM Kisan: అన్నదాతలు అలర్ట్.. ఇవీ పూర్తిచేస్తేనే ‘పీఎం కిసాన్’

దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతన్న ఆరుగాలం కష్టించి పనిచేస్తేనే.. మనం నాలుగు ముద్దలయినా తినగలుగుతున్నాం.

  • Written By:
  • Publish Date - February 18, 2022 / 01:25 PM IST

దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతన్న ఆరుగాలం కష్టించి పనిచేస్తేనే.. మనం నాలుగు ముద్దలయినా తినగలుగుతున్నాం. ఎన్ని నష్టాలు వచ్చినా… తాను నమ్ముకున్న వ్యవసాయాన్నే చేస్తున్నాడు రైతన్న. అలాంటి రైతన్నలను పట్టించుకోవాల్సిన కనీప బాధ్యత మనందరి పైనా ఉంది. మరోవైపు రైతులను పట్టించుకుంటున్నాం అంటూ… ప్రభుత్వాలు కొన్ని పథకాలను ప్రవేశపెట్టాయి. అయినా కూడా రైతులకు ఎంతచేసినా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ల కష్టం అలాంటిది. వచ్చే నష్టాలూ అలాంటివే.

ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొన్ని పధకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైనదిగా ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల రూపాయిలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 10 విడతల డబ్బులను అన్నదాతల బ్యాంక్ అకౌంట్‌ లలో జమ చేసింది. ఇప్పుడు 11వ విడత డబ్బులు పంపిణీ చేయాల్సి ఉంది మోదీ సర్కార్. అయితే ఈ దఫా డబ్బులు అకౌంట్లలో పడాలంటే… ఈకేవైసీ(EKYC) ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని కేంద్ర సర్కార్ సూచిస్తోంది.

అది ఎలా చేయాలో చూడండి:

* ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ లోకి వెళ్ళినట్లైతే.. అక్కడ ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. ఇందులో మీకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ ఫస్ట్ క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ఓపెన్ అయిన కొత్త పేజీలో రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
* ఆ తర్వాత ఆధార్ నెంబర్‌ తో లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* అనంతరం గెట్ మొబైల్ నెంబర్ OTP ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. దీన్ని అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ EKYC ప్రాసెస్ మొత్తం పూర్తి అవుతుంది.

ఈ విధంగా ఈకేవైసీ ని పూర్తి చేసుకున్నవారికే 11వ విడత డబ్బు అకౌంట్లలో జమ కానుంది. సో.. రైతన్నలకు తెలియకపోతే, వారికి చెప్పి, వారికి సహకరించగలరు.

గమనిక:
కుటుంబంలో కేవలం ఒకరు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులకు అర్హులు. వారికి మాత్రమే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. అలాకాకుండా ఒకరి కన్నా ఎక్కువ మంది డబ్బులు పొందినట్లైతే.. అది నేరంగా పరిగణించబడుతుంది.