కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతికి తోడ్పడే విధంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ద్వారా Self Help Group – Bank Linkage Programme (SHG-BLP) పేరిట ఓ ప్రత్యేక రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం సహాయక బృందాలుగా (SHG) ఏర్పడి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించబడింది. ఈ రుణాన్ని ఉపయోగించి చిరు వ్యాపారాలు, పశుపోషణ, టైలరింగ్, క్రీడా కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వంటి వాటిని ప్రారంభించవచ్చు.
TATA Cars Life Time service : టాటా ఎలక్ట్రిక్ కార్లు.. ఈ మోడల్స్‌పై జీవితకాలం బ్యాటరీ ప్యాక్ వారంటీ!
ఈ పథకం ద్వారా మహిళలకు కేవలం రుణం మాత్రమే కాదు, అవసరమైన శిక్షణ కూడా నాబార్డ్ ద్వారా అందించబడుతుంది. ముఖ్యంగా టైలరింగ్, పెకింగ్, అగ్రో ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో నైపుణ్యాలున్న మహిళలు 10-20 మంది కలిసి SHGగా రిజిస్టర్ అయ్యి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా రూ.50,000 నుంచి ప్రారంభించి, ప్రగతికి అనుగుణంగా రుణ పరిమితి రూ.5 లక్షల వరకూ పెంచవచ్చు. ఈ రుణంపై కేంద్ర ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.3 లక్షల వరకు సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది.
Thane School : ఆ అనుమానంతో విద్యార్థినులు దుస్తులు విప్పించిన స్కూల్ ప్రిన్సిపల్
ఈ రుణం కోసం దరఖాస్తు చేయాలంటే.. సంబంధిత జిల్లా నాబార్డ్ కార్యాలయాన్ని సంప్రదించాలి. రుణం వ్యక్తిగతంగా కాదు, SHG పేరిట మంజూరు చేయబడుతుంది. అవసరమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, SHG బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, సభ్యుల సంతకాలు, షరతులకు అంగీకార పత్రాలు అవసరం. రుణంపై వడ్డీ శాతం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఇది 3 శాతం వరకు ఉండవచ్చు. తిరిగి చెల్లించే కాలవ్యవధి 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ పథకం ద్వారా మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం ద్వారా తమ కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, స్వావలంబనను ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవితాన్ని నిలకడగా మార్చుకోవచ్చు.