ED – 10 Years : మోడీ హయాంలో ఈడీ దూకుడు.. పదేళ్ల లెక్కలివీ..

ED - 10 Years : ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కడ చూసినా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురించే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 08:44 AM IST

ED – 10 Years : ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కడ చూసినా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురించే కనిపిస్తోంది. ప్రత్యేకించి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడును యావత్ దేశ ప్రజలు గమనిస్తున్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దగ్గరి నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాకా హై ప్రొఫైల్ లీడర్లను ఈడీ అరెస్టు చేయడం పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఓ వైపు బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రచార హెలికాప్టర్‌‌ను.. మరోవైపు కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార విమానాన్ని ఈడీ అధికారులు తనిఖీ చేయడం వార్తల్లో నిలిచింది. మునుపెన్నడూ లేని విధంగా సరిగ్గా ఎన్నికల వేళ ఈడీ దూకుడు మరింత పెరుగుతుండటాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు. ఈతరుణంలో గత పదేళ్ల ఈడీ(ED – 10 Years) పనితీరుపై ఓ పరిశీలన..

We’re now on WhatsApp. Click to Join

  • కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీకి చెందిన ఎన్డీయే హయాంలో 86 రెట్లు ఎక్కువగా ఈడీ రైడ్స్ చేసింది. 24 రెట్లు   అధికంగా ఈడీ అరెస్టులు చేసింది.
  • యూపీఏ హయాంలో ఈడీ 1,797  కేసులను నమోదు చేసింది. గత పదేళ్ల మోడీ హయాంలో 5,155 కేసులను నమోదు చేసింది.
  • యూపీఏ హయాంలో ఈడీ 84 సోదాలు చేసింది.  గత పదేళ్లలో 7,264 సోదాలు చేసింది.
  • యూపీఏ హయాంలో ఈడీ  29 అరెస్టులు చేసింది. గత పదేళ్లలో 755 మందిని ఈడీ అరెస్టు చేసింది.
  • యూపీఏ హయాంలో ఈడీ  రూ.5,086.43 కోట్లు జప్తు చేసింది. గత పదేళ్లలో  రూ.1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
  • యూపీఏ హయాంలో స్థిర, చరాస్తుల జప్తునకు 311 ఉత్తర్వులను ఈడీ జారీ చేసింది.  గత పదేళ్లలో దీనికి సంబంధించిన 1971 ఉత్తర్వులను జారీ చేసింది.
  • యూపీఏ హయాంలో ఈడీ 102 ఛార్జిషీట్లు దాఖలు చేసింది.  గత పదేళ్లలో 1281 ఛార్జిషీట్లు నమోదయ్యాయి.

Also Read : Political Heirs : రాజకీయ వారసులతో ఎన్నికల ప్రయోగం.. ఏమవుతుందో ?

  • గత పదేళ్లలో పీఎంఎల్‌ఏ నేరాల కింద రూ.15,710.96 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ అనుమతి పొందింది.
  • పీఎంఎల్‌ చట్టం కింద గత పదేళ్లలో రూ.2,310 కోట్ల విలువైన భారత, విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది. యూపీఏ హయాంలో ఇలా స్వాధీనం చేసుకున్న అమౌంట్ కేవలం రూ.43 లక్షలే.
  • 2014-24 మధ్య కాలంలో భారత్‌ వదిలి వెళ్లిన నిందితులను పట్టుకొనేందుకు ఈడీ 24 ఇంటర్‌ పోల్‌ రెడ్‌ నోటీసులు విడుదల చేసింది. 43 మంది నిందితులను అప్పగించాలని కోరుతూ వివిధ దేశాలకు లేఖలు రాసింది.

Also Read :Indian Railways: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై ఒకే యాప్‌లో అన్ని ర‌కాల‌ రైల్వే సేవ‌లు..!