Drones Vs Maoists : ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా చాలా రాష్ట్రాల్లో మావోయిస్టుల వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇదెలా సాధ్యం అవుతోంది ? అంటే.. మావోయిస్టుల నడుమ దాగిన గూఢచారులు అందించే సమాచారం వల్ల !! మావోయిస్టులు సంచరించే ప్రాంతాల ప్రజల నుంచి కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంటుంది. మరో కీలకమైన అంశం.. డ్రోన్ల పహారా. ఇవి అడవుల గగన తలంలో చక్కర్లు కొడుతూ మావోయిస్టుల కదలికల ఫుటేజీని(వీడియోలు, ఫొటోలు) పోలీసులకు, భద్రతాలకు పంపిస్తుంటాయి. అయినా ఆయా రాష్ట్రాల అడవుల్లో మావోయిస్టులు తమను తాము ఎలా కాపాడుకుంటున్నారు ? అనేది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Eatala Rajendar : ‘రియల్’ బ్రోకర్‌పై ఈటల రాజేందర్, అనుచరుల ఎటాక్.. ఎందుకు ?
డ్రోన్లకు చిక్కకుండా ఇలా ఎస్కేప్ ..
- అడవులపై డ్రోన్ల పహారా ఉందనే విషయాన్ని మావోయిస్టులు(Drones Vs Maoists) ఎప్పుడో గ్రహించారు.
- డ్రోన్ల కన్ను కప్పేందుకు, డ్రోన్లు తీసే ఫొటోలలో కనిపించకుండా ఉండేందుకు.. మావోయిస్టులు స్నైపర్ జాకెట్లను ధరిస్తుంటారు.ఫలితంగా పచ్చటి అడవుల నడుమ వారి కదలికలను గుర్తించడం కష్టతరంగా మారుతుంది.
- గతంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు స్నైపర్ జాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని అడవుల్లో పలుచోట్ల టన్నెల్స్ నిర్మించుకున్నారు. వారి రాకపోకలు ఆ రహస్య సొరంగాల నుంచే జరుగుతుంటాయి. ఫలితంగా డ్రోన్లలోని కెమెరాల కంటికి వారు చిక్కే అవకాశాలు ఉండవు.
- ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధిలోని అడవుల్లో ఇలాంటి చాలా సొరంగాలను పోలీసులు, భద్రతా సిబ్బంది గుర్తించారు.
- ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న అబూజ్ మడ్ ఏరియా అడవులు చాలా దట్టంగా ఉంటాయి. వాటిపై డ్రోన్లతో నిఘా కష్టతరంగా ఉంటుంది. అందుకే ఆ అడవుల్లో మావోయిస్టుల యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.
- అబూజ్‌మడ్ అడవుల్లోనే మావోయిస్టుల ఆయుధ నిల్వలు పెద్దసంఖ్యలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేతలు సైతం ఈ అడవుల్లోనే ఉంటున్నారని టాక్.
- ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్, బీజాపుర్ జిల్లాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అబూజ్‌మడ్ అడవులు విస్తరించి ఉన్నాయి.