Court Notice to ED : సత్యేందర్ జైన్ తీహార్ జైలు వీడియో ఎలా లీక్ అయ్యింది? ఈడీకి కోర్టు నోటిసులు..!!

  • Written By:
  • Updated On - November 20, 2022 / 09:52 AM IST

ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందంటూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ వీడియో లీక్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని ఈడీని కోరింది. వీడియో లీక్ అయిన తర్వాత ఈడీ పై ధిక్కార చర్యలు తీసుకోవాలని సత్యేందర్ జైన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆఫిడవిట్ ఇచ్చినప్పటికీ ఈడీ సీసీటీవీ వీడియోను లీక్ చేసిందని జైన్ లీగన్ టీం ఆరోపించింది. ఇఫ్పుడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వికాస్ ధుల్ దీనికి సంబంధించి ఈడీకి నోటీసులు జారీ చేస్తూ ఈ కేసును నవంబర్21కి వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే…తీహార్ జైలులోని సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో లో సత్యేందర్ జైన్ మంచం మీద పడుకుని ఏదో చదువుతున్నాడు. ఈ సమయంలో ఓవ్యక్తి తన పాదాలకు మసాజ్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టం కనిపించింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఆప్ ను టార్గెట్ చేస్తున్నాయి. మనీలాండరింగ్ ఆరోపణలతో మే 30న సత్యేందర్ జైన్ ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.