Goa Vacation: గోవాకు పర్యాటకుల తాకిడి, హోటల్స్, రెస్టారెంట్స్ ఫుల్

వర్షకాల సీజన్ లోనూ గోవాకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో అక్కడి హోటల్స్ సందర్శకులతో నిండిపోయి కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - August 12, 2023 / 05:39 PM IST

గోవాలో రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత బీచ్ టూరిస్టుల తాకిడి తగ్గినా.. రాష్ట్రానికి వచ్చే దేశీయ పర్యాటకుల సంఖ్య మాత్రం తగ్గలేదు. టూరిజం పరంగా ‘ఆఫ్ సీజన్’ ప్రారంభమైనా.. రాష్ట్రంలోని హోటళ్లు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. వచ్చే పక్షం రోజుల నుంచి రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీల ఈవెంట్లు ప్రారంభం కానుండగా.. హోటళ్లన్నీ 100 శాతం నిండిపోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం గోవాలో టూరిజం ఆఫ్ సీజన్ ప్రారంభం కావడంతో హోటళ్లు తమ రేట్లను 25 నుంచి 30 శాతం వరకు తగ్గించాయి. దీనికి తోడు విమాన టిక్కెట్ల ధరలు గతంలో కంటే చాలా తక్కువగా ఉండడంతో దేశీయ పర్యాటకులు, దేశీయ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకోవడం ప్రారంభించాయి. దీంతో వర్షాలు ప్రారంభమైనా గోవాలో పర్యాటకుల తాకిడి తగ్గలేదు.

అయితే వర్షాకాలంలో ఈ ధరలన్నీ 30 నుంచి 40 శాతం వరకు తగ్గాయి. దీంతో దేశీయ పర్యాటకుల అడుగులు గోవా వైపు మళ్లాయని, భారీ వర్షాల్లో కూడా గోవా బీచ్‌లలో రద్దీ పెరగడం ప్రారంభమైందని గోవా టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలేష్ షా తెలిపారు. గోవా బీచ్ ను ఎంజాయ్ చేయడానికి  వెళ్తున్న వారిలో యూత్ తో పాటు పెద్దలు కూడా ఉండటం గమనార్హం.

Also Read: Kajal Agarwal: నాగ్ తో రొమాన్స్ కు కాజల్ రెడీ, ఇదిగో అప్డేట్!