Amit Shah: ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్టేందుకు మ‌రింత‌గా దృష్టి సారించాలి!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం ప్రారంభ‌మైన జాతీయ‌ భ‌ద్ర‌త, వ్యూహాల స‌ద‌స్సు..

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 07:48 PM IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం ప్రారంభ‌మైన జాతీయ‌ భ‌ద్ర‌త, వ్యూహాల స‌ద‌స్సు.. ఈ రోజు కూడా కొన‌సాగుతోంది. ఢిల్లీలో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మంలో హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా స‌హా అన్ని రాష్ట్రాల డీజీపీలు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్టేందుకు మ‌రింత‌గా దృష్టి సారించాల‌ని సూచించారు. మానవ మేధ‌స్సును మ‌రింత వినియోగించుకునేలా చర్య‌లు తీసుకోవాలన్నారు.

ప్ర‌ధానంగా రాడిక‌లిజం, క్రిప్టోక‌రెన్సీ, కౌంట‌ర్ డ్రోన్ టెక్నాల‌జీ వంటి అంశాల‌పై అమిత్ షా చ‌ర్చించారు. అదేవిధంగా మావోయిస్టుల నుంచి ఎదుర‌వుతున్న స‌వాళ్లు, వాటిని అధిగ‌మించే వ్యూహాలు సహా జాతీయ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
నేటితో ఎన్ ఎస్ ఎస్ స‌ద‌స్సు ముగియ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపాయి.