Hindi Language Issue : ఒకే దేశం ఒకే భాష‌

వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్‌, వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్‌, వ‌న్ నేష‌న్ వ‌న్ లాగ్వేజ్ ...ఇలా అన్నింటినీ ఏకీకృతం చేయ‌డానికి కేంద్రం సిద్ధం అవుతుంద‌ని అనిపిస్తోంది. ఒకే దేశం ఒకే భాష అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్ర‌స్తావ‌న‌కు తీసుకొస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 13, 2022 / 05:12 PM IST

వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్‌, వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్‌, వ‌న్ నేష‌న్ వ‌న్ లాగ్వేజ్ …ఇలా అన్నింటినీ ఏకీకృతం చేయ‌డానికి కేంద్రం సిద్ధం అవుతుంద‌ని అనిపిస్తోంది. ఒకే దేశం ఒకే భాష అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్ర‌స్తావ‌న‌కు తీసుకొస్తున్నారు. రాబోయే 2024 ఎన్నిక‌ల‌కు ఇదే నినాదాన్ని తీసుకెళ్ల‌డం ద్వారా హిందుత్వాన్ని సంఘ‌టితం చేయాల‌ని భావిస్తున్నారు. `హిందీ-హిందూ-హిందూస్థాన్` అనే సంఘ్ పరివార్ మంత్రం వేయ‌డానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది. హిందీ భాష‌ బిజెపి ఓట్లను సంఘటితం చేయడానికి తదుపరి అస్త్రంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్రతిచోటా భారతీయులు ఇంగ్లీషులో కాకుండా హిందీలో సంభాషించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పౌరులపై ఊహించినంత గా ప‌నిచేస్తోంది.
భారతీయ జనతా పార్టీ కొన్ని ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో మాట్లాడే భాషను తమిళం, బెంగాలీ లేదా మరాఠీ మాట్లాడే వారిపై రుద్దాలని ప్రయత్నిస్తోంది? వైవిధ్యమైన, బహుభాషా దేశంలో ‘ఒక దేశం, ఒకే భాష’ వైపు ఈ ఆకస్మిక కదలిక ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఆలోచింప చేస్తోంది. 2017లో ఇదే విధమైన ప్రయత్నాన్ని బీజేపీ చేసింది. సాధారణ ఎన్నికలకు రెండేళ్ల ముందు ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందీని ముందుకు తీసుకురావాలని భావించింది. కార్యకర్తలు, రాజకీయ పార్టీలు దానిని తీవ్రంగా వ్యతిరేకించ‌డంతో మౌనంగా ఉండిపోయింది.

ఇంగ్లీషు ఒకప్పుడు విశేష, శక్తిమంతుల భాషగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు అది సాధికారత భాషగా మారింది. ఆంగ్లం వ్యాప్తి ప్రజాస్వామ్యీకరించింది. ఇది కేవలం ఉన్నత వర్గాల భాష కాదు. ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల ఉద్యోగాల స్పెక్ట్రమ్‌లో ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. కాల్ సెంటర్‌ల నుంచి టీచింగ్ వరకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కార్పొరేట్ ఉద్యోగాల వ‌ర‌కు ఆంగ్లం ప్రాధాన్యం ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు అర్హత, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం కోసం భారతదేశం అంతటా ఆంగ్ల-మాధ్యమ పాఠశాలలు మొలకెత్తాయి. డిమాండ్ కు అనుగుణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఆంగ్ల భాషను నేర్చుకోవాలని కోరుకుంటున్నారు.షా అండ్ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. హిందీని బ‌ల‌వంతంగా రుద్దాల‌ని భావిస్తున్నారు. హిందీ భాష‌లోనూ వివిధ మాండలికాలు ఉన్నాయి. వాటిలో ఏ మాండ‌లికాన్ని తీసుకోవాలి? అనే ప్ర‌శ్న. ఇప్పుడు బీజేపీలోనూ ఉంది. స‌ర్కారీ హిందీ ఏ మాండ‌లికంలో ఉండాలి అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఒక రకమైన జాతీయ అనుసంధాన భాషగా దాని హోదాను సమర్థించుకోవడానికి హిందీ ని ఫోక‌స్ చేస్తున్నారు. తన ఆలోచన ఆచరణ సాధ్యంకాదని, వివిధ రాష్ట్రాల్లో చురుగ్గా ప్రతిఘటిస్తామని షా ఖచ్చితంగా తెలుసుకుంటారు. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక అల్లర్ల గురించి ఆయన విని ఉండవచ్చు. అయినప్పటికీ, అతను ఆలోచనను మార‌లేదు. ఇప్పుడు ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి 2024 ఎన్నికలు ఖచ్చితంగా ఒక కారణం కావచ్చు. 2019లో హిందీ గురించి ఏమీ వినపడనట్లు వివాదాస్పద అంశాలను వెనుక్కు నెట్టారు.

అయితే ఐదేళ్ల క్రితం కంటే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. బిజెపి మరియు దాని భాగ‌స్వామ్య పార్టీలు మరింత దూకుడుగా ఉన్నాయి. హిందుత్వ దళాలు వివిధ రాష్ట్రాలకు – ప్రత్యేకించి తమ పార్టీ అధికారంలో ఉన్న చోట – శాఖాహారం ఉద్య‌మాన్ని చేపట్టారు. ఏ రకమైన మాంసాహారం తిన్నా లేదా విక్రయించే వారి వెంట పడుతున్నారు. మటన్ దుకాణాలు దాడి చేయబడ్డాయి. వ్యాపారులు వ్యాపారం నుండి దూరంగా ఉంచబడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంటీన్‌లో మాంసాహారం అందిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇతర విద్యార్థులను కొట్టారు.హిందీని కూడా అదే విధంగా ఆయుధం చేసుకోవచ్చు. హిందుత్వవాద గ్రూప్స్ భాషని ప్రచారం చేసే పేరుతో ఎవరినైనా టార్గెట్ చేయ‌డానికి సిద్ధం అవుతారు. షా ప్రకటన ఈసారి, మతపరమైన సమీకరణను పెద్ద ఎత్తున ఉండేలా చూడాలనే ఉద్దేశం ఉంది. హిందీ-హిందూ-హిందూస్థాన్ అనే సంఘ్ పరివార్ మంత్రంలో భాగంగా బిజెపి ఓట్లను సంఘటితం చేయడానికి తదుపరి అస్త్రంగా చేసుకుంది.