Rains : హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు ఆగడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి. పరిస్థితి విషమంగా మారడంతో భారత వాతావరణ శాఖ (IMD) హిమాచల్‌లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్‌లోని మండి జిల్లాలో బియాస్ నది ప్రమాదకరంగా ఉప్పొంగుతోంది. ఇప్పటికే 10 మంది మృతి చెందగా, తొమ్మిది మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు అధికారులు తెలిపారు.
Cocktail: మద్యం అతిగా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుతుందా?
20 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఇప్పటివరకు 99 మందిని రక్షించామని వెల్లడించారు. వర్షాల ధాటికి 10 ఇళ్లతో పాటు 12 గోశాలలు దెబ్బతిన్నాయి. మండి-మనాలీ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. భద్రత దృష్ట్యా మండి జిల్లాలో మంగళవారం అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. కాంగ్రా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లోని పాఠశాలలు కూడా మూసివేసారు. మండి, సిర్మౌర్ జిల్లాల్లో 250కుపైగా రహదారులను మూసివేశారు. వర్షాల ప్రభావంతో 614 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 130కి పైగా నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా మృతుల సంఖ్య 23కి చేరుకుంది.
ఉత్తరాఖండ్‌లోని చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి, బాగేశ్వర్, పిథోరాగఢ్ జిల్లాల్లో IMD భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. జూలై 2 వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. చమోలిలో జూలై 1 నుండి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Remittance Tax : అమెరికాలోని భారతీయులకు ట్రంప్ శుభవార్త.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికే పరిమితం!