Polling: నేడు హిమాచల్ ప్రదేశ్ పోలింగ్. ఏర్పాట్లన్నీ పూర్తి, బరిలో 400మంది అభ్యర్థులు..!!

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 06:01 AM IST

ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. 68 నియోజవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు. 400మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఓటు రూపంలో తేల్చనున్నారు.

కాగా గురువారంతో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కు 48గంటల ముందు నుంచే ప్రచారంపై నిషేధం అమల్లోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. తాము చేసిన అభివ్రుద్ధి పనులే తమను అధికారంలోకి తెచ్చేలా చేస్తాయని బీజేపీ దీమాగా ఉంది. అధికారపార్టీ హామీలు నెరవేర్చలేదని…అవే తమను అధికారంలోకి తీసుకువచ్చేలా చేస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీజేపీ సీనియర్ నాయకులు మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ వీరంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ప్రియాంకగాంధీ ప్రచారం చేశారు.

ఇక పోలింగ్ అనంతరం వెలువడే ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం విధించింది. నేడు హిమాచల్ ప్రదేశ్ లో, డిసెంబర్,1, 8వ తేదీల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసింేద. అందుకే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడానికి వీల్లేదని ఈసీ తెలిపింది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ గురించి తెలిపినట్లయితే…కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.