Site icon HashtagU Telugu

Rahul Gandhi Hilarious Moment: భారత్ జోడో యాత్రలో రాహుల్ పెళ్లి మాటలు..తమిళ యువతితో పెళ్లి చేస్తామంటూ ఆఫర్..!!

Rahul

Rahul

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ యాత్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది. మధ్యాహ్నం మార్తాండం ప్రాంతానికి చేరుకుంది. అక్కడ భోజన విరామం తీసుకున్న సందర్భంలో అక్కడ ఉపాధిహామీ కూలీలతో చర్చించారు రాహుల్. వారి సంపాదన, కుటుంబ స్థితిగతుల గురించి చర్చించారు. వారితో ఎంతో కలవోకగా మాట్లాడిన రాహుల్ ను ఓ మహిళ సరదా అడిగిన ప్రశ్న వైరల్ గా మారింది.

ఓ మహిళ రాహుల్ గాంధీతో మాట్లాడుతూ… మీ పెళ్లి ఎప్పుడంటూ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. మీరు తమిళనాడును ఎంతగానే ఇష్టపడుతున్న విషయం మాకు తెలుసు. మీరు సరే అంటే తమిళ యువతితో మీకు పెళ్లి చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. వారితో జరిగిన సంభాషణ గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ చాలా ఉషారుగా ఉత్సాహంగా ఉన్నార్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవ్వుతున్న ఫొటోలను ట్వీట్ చేశారు జైరాం రమేశ్. రాహుల్ గాంధీతో కలిసి జైరాంరమేశ్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో 3,570కిలోమీటర్లు నడిచారు. జైరాం రమేశ్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.