Interim Budget : బడ్జెట్‌లో పలు శాఖలకు.. పథకాలకు కేటాయింపులు చూస్తే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget) ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ (పీఎం Modi) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడం విశేషం. మొత్తం బడ్జెట్ (Total Budget ) ను రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. ఇందులో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చూస్తే.. మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి […]

Published By: HashtagU Telugu Desk
Budget 2024 Nirmala

Budget 2024 Nirmala

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget) ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ (పీఎం Modi) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడం విశేషం. మొత్తం బడ్జెట్ (Total Budget ) ను రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు.

ఇందులో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చూస్తే..

మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
రైల్వేశాఖకు రూ.2.55లక్షల కోట్లు
సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8500కోట్లు
గ్రీన్‌ హైడ్రోజన్‌కు రూ.600కోట్లు
హోంశాఖకు రూ.2.03లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి రూ.7500కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు కేటాయించారు.

We’re now on WhatsApp. Click to Join.

మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో నిర్మలా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. 2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. అన్ని వర్గాలు, ప్రజలందరి సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.’ అని పేర్కొన్నారు.

ప్రపంచమంతా ఆర్థిక పరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ G20 సదస్సుని విజయవంతంగా పూర్తి చేయగలిగామని వెల్లడించారు. యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం చరిత్రాత్మక నిర్ణయం అని ప్రశంసించారు.దేశవ్యాప్తంగా 92 యూనివర్సిటీలు ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. యువతకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం అని వివరించారు.

Read Also : Interim Budget : ఫిషరీస్ ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు

  Last Updated: 01 Feb 2024, 01:37 PM IST