Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్‌లోని మర్దా ప్రాంతంలోని మహాహర్ధమ్ టెంపుల్ సమీపంలో ఓ పెళ్లి బస్సుకి హైటెన్షన్ వైరు తగలడంతో మంటలు చెలరేగాయి.దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Ghazipur Bus Accident

Ghazipur Bus Accident

Ghazipur Bus Accident: ఉత్తరప్రదేశ్ విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్‌లోని మర్దా ప్రాంతంలోని మహాహర్ధమ్ టెంపుల్ సమీపంలో ఓ పెళ్లి బస్సుకి హైటెన్షన్ వైరు తగలడంతో మంటలు చెలరేగాయి.దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మౌలోని రాణిపూర్ ప్రాంతానికి చెందిన యువతీ వివాహం నిశ్చయమైంది. మహాహర్ధమ్ సమీపంలోని భైరో ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది. మౌ నుండి భైరో ఆలయానికి అమ్మాయి తరుపు బంధువులు బస్సులో వెళ్తున్నారు. మహాహర్ధం దేవాలయం సమీపంలో బస్సును నిలిపివేశారు. దీంతో వధువు బస్సు దిగి కాలినడకన గుడికి వెళ్లింది. దీని తర్వాత బస్సు డ్రైవర్ కెనాల్ ట్రాక్ గుండా బస్సును ఆలయానికి తీసుకెళుతుండగా ఇంతలో రోడ్డుపై వేలాడుతున్న 11 వేల వోల్టుల హైటెన్షన్ వైరును బస్సు తాకింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. గాయపడిన పది మందిని ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసే సమయానికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులను గుర్తించలేకపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ

  Last Updated: 11 Mar 2024, 05:32 PM IST