ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఎందుకు ? ఏమిటి? ఎక్కడ అనేది తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చదవాల్సిందే .
ఛత్తీస్ గఢ్ లో దీపావళి వేడుకలు జరిగిన మరుసటి రోజు ఉదయం(మంగళవారం) దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో గోవర్ధన్ పూజ జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ హాజరయ్యారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తులలాగే ముఖ్యమంత్రి బాఘెల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. దీనివల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటించారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొంటారు.
सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022
దీపావళి వేడుకల్లో భాగంగా ఆలయంలో పూజలు చేసిన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆపై కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని జజంగిరి గ్రామస్థుల విశ్వాసం. అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలూ సాధారణమే. ఈ పూజలో పాల్గొన్న భక్తులు కొరడా దెబ్బల కోసం ఎగబడతారు. జజంగిరి వెళ్లిన ముఖ్యమంత్రి బాఘెల్ కూడా ఇలాగే కొరడా దెబ్బలు తిన్నారు. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది.