కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా.. ప్రియాంక గాంధీ 6 ప్రధాన హామీలు!

ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - October 23, 2021 / 04:14 PM IST

ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది. తనదైన స్టయిల్ అవాక్కులు, చలోక్తులు విసురుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రియాంక గాంధీ వాద్రా శనివారం మూడు ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్నారు. అక్టోబరు 23 నుంచి నవంబరు 1 వరకు ఈ యాత్రలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు కోసం ఆరు ప్రధాన హామీలు ఇచ్చారు. అవి ఏమిటంటే..

  1. 12 వ తరగతి చదివే అమ్మాయిలకు స్మార్ట్‌ఫోన్‌లు, గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు స్కూటీలు.
  2. రైతుల రుణ మాఫీ. గతంలో 72 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తాం.
  3. ఛత్తీస్‌గఢ్ మాదిరిగానే యూపీలో గోధుమలు, వరి ధరలను రూ.2500గా నిర్ణయిస్తాం. చెరకు మద్దతు ధర క్వింటాలుకు రూ .400 ఉంటుంది.
  4. కోవిడ్ -19 సమయంలో విద్యుత్ బిల్లులను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రతిఒక్కరి విద్యుత్ బిల్లును సగానికి తగ్గిస్తాం.
  5. కరోనా కాలంలో సంపాదించలేని పేద కుటుంబాలకు రూ.25,000 ఆర్థిక సాయం అందిస్తాం.
  6. రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించడానికి శ్రమిస్తాం. కాంట్రాక్టు కార్మికులను కూడా క్రమబద్ధీకరిస్తాం.