Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్తకాశీకి బయలుదేరిన ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్, గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా మొత్తం ఏడుగురు మరణించారు. ప్రయాణికులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారని గుర్తించారు.
ప్రమాదానికి ముఖ్య కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఉదయం సుమారు 5:20 సమయంలో జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలో, ఘటన స్థలానికి వెంటనే SDRF మరియు NDRF బృందాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.