Site icon HashtagU Telugu

300 Tourists Stranded : టన్నెల్‌లో చిక్కుకుపోయిన 300 మంది.. హిమపాతం ఎఫెక్ట్

300 Tourists Stranded

300 Tourists Stranded

300 Tourists Stranded : భారీ హిమపాతం హిమాచల్‌ప్రదేశ్‌ను వణికిస్తోంది. దాదాపు 300 మంది పర్యాటకులు రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్‌పీ) సమీపంలో చిక్కుకుపోయారు.  హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC)కు చెందిన ఒక బస్సు సహా దాదాపు 50 వాహనాల్లో ఈ 300 మంది టూరిస్టులు(300 Tourists Stranded) చిక్కుకుపోయారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని టన్నెల్ నుంచి వాళ్లను బయటికి తీశారు. ఈవివరాలను కులు ఎస్పీ సాక్షి వర్మ మీడియాకు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో తనతో పాటు మనాలీ ఎస్డీఎం, తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా ఇతర అధికారులు పాల్గొన్నట్టు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

ఇక వాతావరణ శాఖ కూడా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీ హిమపాతం, వర్షాలపై వార్నింగ్ ఇచ్చింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు లాహౌల్-స్పితి, కిన్నౌర్, చంబా, కులు, మండీ, సిర్మూర్, సిమ్లా జిల్లాల్లోని ఎత్తైన ప్రాంతాలు, సిమ్లా, పరిసర ప్రాంతాలలో భారీ హిమపాతం, వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ ప్రాంతాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  రాష్ట్రంలోని దిగువ కొండలు, మైదానాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.కాంగ్రా, బిలాస్‌పూర్, సిమ్లా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని  పేర్కొంది.

Also Read :Noida Film City Project: నోయిడాలో ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్‌.. బిడ్ గెలిచిన బోనీ కపూర్ సంస్థ

దేశంలో 718 మంచు చిరుతలు

దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (WII)’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలింది. న్యూఢిల్లీలో జరిగిన ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌’ సమావేశంలో ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. దేశంలో మంచు చిరుతలు నివసించే 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో (లఢఖ్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ ) 70 శాతానికి పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్‌ చేసిందని కేంద్రం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. మొత్తం 1971 ప్రాంతాల్లో 1.80 లక్షల ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు. మంచు చిరుతల సంఖ్యకు సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి. అందులో అత్యధికంగా లఢఖ్‌లో 447 చిరుతలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో 124, హిమాచల్‌ప్రదేశ్‌లో 51, అరుణాచల్‌ప్రదేశ్‌లో 36, సిక్కింలో 21, జమ్ము అండ్‌ కశ్మీర్‌లో 9 మంచు చిరుతలు ఉన్నాయి.

Also Read : Israel Job: ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు.. యూపీ నుంచి 5 వేల మందికి పైగా అభ్యర్థులు ఎంపిక‌..!