Site icon HashtagU Telugu

Mumbai : భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబైలో నేడు స్కూల్స్ బంద్‌

Schools

Schools

భారీ వర్షాలు ముంబయిని అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముందస్తుగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నేడు (గురువారం) స్కూల్స్ మూసివేయాల‌ని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ స‌ర్క్యూల‌ర్ జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బీఎంసీలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వాహనాల రాకపోకలను ప్రభావితం చేసింది. థానే , పాల్ఘర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాలలో వ‌ర‌ద నీరు నిలిచిపోయింది. థానేలోని లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), పోలీస్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ బృందాలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లు చేపడుతున్నాయని పాల్ఘర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ వివేకానంద్ కదమ్ తెలిపారు. రాబోయే 24 గంటల్లో నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షపాతం, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబై వాతావ‌ర‌ణ విభాగ‌వ తెలిపింది.

Exit mobile version