Site icon HashtagU Telugu

Rains : మహారాష్ట్రలో భారీ వర్షాలు..ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి

Panchavati

Panchavati

మహారాష్ట్ర(Maharashtra)లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గోదావరి (Godavari) నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగింది. గంగాపూర్ డ్యామ్ పూర్తిగా నిండిపోయి, అక్కడి అధికారులు భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో నదికి చేరుతున్న వరద ప్రవాహం మరింత పెరిగింది. వరద ప్రభావంతో నది పరివాహక ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Vande Bharat : వందే భారత్‌ను ఆపిన ఎద్దు.. మళ్లీ ప్రాణాపాయం తప్పిన ఘటన

గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ఆలయాలు, వంతెనలు వరద నీటిలో మునిగిపోయాయి. పంచవటి ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలైన పలు పురాతన దేవాలయాలు పూర్తిగా నీటమునగడంతో అక్కడి ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొరబడడంతో స్థానికులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయ చర్యలు ముమ్మరం చేసింది.

గోదావరి ఉధృతితో పాటు వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. డ్యామ్‌ నుంచి నీటి విడుదల కొనసాగుతున్నందున మరిన్ని ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. నాసిక్, ఆర్‌గావ్, పాయ్‌గావ్ ప్రాంతాల్లో సహాయక బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రజలు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అధికారుల సూచనలను పాటించాలని విన్నవిస్తున్నారు.