Site icon HashtagU Telugu

Bangalore Rains : భారీ వర్షాలతో బెంగుళూర్ ఉక్కిరిబిక్కిరి

Heavy Rain Bengaluru

Heavy Rain Bengaluru

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి తీరం వైపు సాగింది. దీని ప్రభావంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు(Bangalore )లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత నాలుగు నుంచి ఐదు రోజులుగా ప్రతి సాయంత్రం భారీ వర్షాలు, ఈదురుగాలులతో నగరాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆదివారం రాత్రి వర్షం మరింత ఉధృతంగా కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు పోటెత్తి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

నగరంలోని కెంగేరి, చామరాజనగర, ఎన్ఎండీసీ క్యాంపస్, సోమశెట్టిహళ్లి, మాదనాయకనహళ్లి, యలహంక తదితర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒక్క రాత్రిలో కెంగేరిలో 132 మిల్లీమీటర్ల వర్షం కురవడం గమనార్హం. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం 100 మిల్లీమీటర్లను దాటింది. చెట్ల కొమ్మలు విరిగిపడడం, రహదారులు ముంపునకు గురవడం, ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. మే నెలలో ఇంత భారీ వర్షం రావడం గత 10 సంవత్సరాలలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

Monica Bedi : మోనికా బేడీకి నకిలీ పాస్‌పోర్ట్‌.. కృష్ణమోహన్‌రెడ్డి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హయాంలోనే!

ఈ వర్షాల తీవ్రత అంతలా పెరిగింది అని చెప్పడానికి మాన్యత టెక్ పార్క్ ఉదాహరణ. 300 ఎకరాల్లో విస్తరించిన ఈ ఐటీ హబ్ లోని కార్యాలయాల్లో వర్షపు నీరు చేరింది. సోమవారం కావడంతో ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండగా, కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశాయి. హెబ్బాళ-కృష్ణరాజపురం మార్గంలో ఉన్న ఈ ప్రాంతం పూర్తిగా నీట మునగడంతో నగర వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. హంపీనగర, కాటన్ పేట్, సిల్క్ బోర్డ్, హొరమావు, విద్యాపీఠ వంటి ప్రాంతాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి.