Puneeth Rajkumar: హీరో పునీత్ గుండెపోటు వెనుక వైద్య మ‌ర్మం

గుండెపోటు వ‌చ్చిన త‌రువాత 30 నుంచి 45 నిమిషాల పాటు హీరో పునీత్ రాజ్ కుమార్ బ‌తికే ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 01:13 PM IST

గుండెపోటు వ‌చ్చిన త‌రువాత 30 నుంచి 45 నిమిషాల పాటు హీరో పునీత్ రాజ్ కుమార్ బ‌తికే ఉన్నాడు. చివ‌రి ప‌ది నిమిషాల్లో ఆయ‌న గుండె క‌వాటాలు, కండ‌రాలు, న‌రాలు పనిచేయ‌క‌పోవ‌డంతో మ‌ర‌ణించాడ‌ని వైద్యులు చెబుతున్నారు. సాధార‌ణంగా గుండెపోటు వ‌చ్చిన వెంట‌నే చ‌నిపోతుంటారు. కానీ, పునీత్ రాజ్ కుమార్ విష‌యంలో మాత్రం భిన్న‌మ‌ని వైద్యులు భావిస్తున్నారు.
వ్యాయామం చేసి ఇంటికొచ్చిన త‌రువాత చాలా మందికి ఇలాంటి గుండెపోటు వ‌స్తుంద‌ట‌. ఇలాంటి కేసులు ఇటీవ‌ల 30శాతం వ‌ర‌కు పెరిగాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వ‌చ్చిన వెంట‌నే కుటుంబ వైద్యుడు పునీత్ ను చెక్ చేశాడు. ఈసీజీ తీసిన త‌రువాత స‌మీపంలోని విక్ర‌మ్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప‌రీక్ష‌లు నిర్వహించిన వైద్యులు ఆయ‌న శ‌రీరం చికిత్స‌కు స‌హ‌క‌రించ‌డంలేద‌ని తేల్చారు. ఇదంతా 30 నుంచి 45 నిమిషాలు ప‌ట్టింద‌ట‌. తొలి 30 నిమిషాల వ‌ర‌కు పునీత్ మాట్లాడుతున్నాడ‌ట‌.
కుటుంబం వార‌స‌త్వం కార‌ణంగా వ‌చ్చే గుండెపోటు, ఇత‌రత్రా అనారోగ్యం కార‌ణంగా వ‌చ్చే గుండెపోటుకు భిన్నంగా పునీత్ ఘ‌ట‌న ఉంది. సాధార‌ణంగా గుండెపోటు సంకేతాలను ముందుగా గుర్తించ‌డానికి వీలుంది. ఛాతి నొప్పి రావ‌డం, నీర‌సంగా ఉండ‌డం, బీసీ, షుగ‌ర్ ప‌రిమితులు అనూహ్యంగా మార‌డం త‌దిత‌ర ల‌క్ష‌ణాలు ఉంటాయి. గుండె క‌వాటాలు మూసుకుపోయిన‌ప్పుడు ఛాతి నొప్పి రావ‌డం జ‌రుగుతుంది. అప్పుడు చికిత్స చేయించుకుని చాలా మంది కొన్నేళ్ల పాటు జీవించిన దాఖ‌లాలు ఉన్నాయి. కానీ, ఇటీవ‌ల జిమ్ లు ఇత‌ర‌త్రా వ్యాయామాలు చేస్తోన్న 17 నుంచి 23ఏళ్ల వ‌య‌స్సు వాళ్లు పునీత్ మాదిరిగా గుండెపోటుకు గుర‌వుతున్నార‌ని డాక్ట‌ర్ల అధ్య‌య‌నంలో తేలింది.
వ్యాయామం చేసే ముందు శ‌రీర‌త‌త్వాన్ని గ‌మ‌నించాలి. వ్యాయామం ముగిసిన త‌ర‌వాత తిరిగి శ‌రీరాన్ని సాధార‌ణ స్థితికి తీసుకు రావాలి. అలా చేయ‌క‌పోవం కార‌ణంగా పునీత్ రాజ్ కుమార్ లాగా యువ‌కులు గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నారు. వ్యాయామం చేసిన‌ప్పుడు ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్ కండ‌రాల‌కు, గుండె న‌రాల‌కు పాకుతుంది. ఆ స‌మ‌యంలో న‌రాలు, గుండె కండ‌రాలు స‌మానంగా విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేసుకోలేక‌పోవ‌డంతో పునీత్ కుమార్ లాగా గుండెపోటుకు గుర‌వుతార‌ని వైద్యులు చెబుతున్నారు.