Site icon HashtagU Telugu

UP CM Adityanath Security: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భద్రతగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

UP CM Adityanath

Resizeimagesize (1280 X 720) (9) 11zon

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Adityanath)కు భద్రతగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బారాబంకిలోని మసౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ గార్డెన్ సిటీలో ఉన్న కానిస్టేబుల్ నివాసంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అర్థరాత్రి వరకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

అయోధ్య జిల్లాలోని ఇనాయత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడంపూర్ గ్రామానికి చెందిన సందీప్ యాదవ్ (35) పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భద్రతలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మసౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-అయోధ్య హైవేకి సమీపంలో ఉన్న గ్రీన్ గార్డెన్ సిటీలో సందీప్ కొన్నేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. అతని కుటుంబం ఇక్కడే నివసిస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో సందీప్ లక్నో నుంచి తన ఇంటికి చేరుకున్నాడని చెబుతున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం ఇంట్లో బుల్లెట్ శబ్ధం రావడంతో అందరూ షాక్ అయ్యారు. బుల్లెట్ శబ్ధం వినిపించిన ఇరుగుపొరుగు వారు సందీప్ ఇంటికి చేరుకునే సరికి భార్య నిషా ఏడుస్తూ ఉండడం, గదిలో రక్తసిక్తమైన స్థితిలో సందీప్ ఉండడం, బుల్లెట్ సందీప్ నుదిటిపైకి దూసుకెళ్లింది.

Also Read: Naxal Attack: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి

సంఘటనా స్థలంలో ఉన్న బంధువులు, ఇరుగుపొరుగు వారు సందీప్‌ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతితో పోలీసు శాఖలోనూ కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

విచారణలో సందీప్ చేతిలో బుల్లెట్లు ఉన్నట్లు తేలింది. పక్కనే పిస్టల్, మ్యాగజైన్ పడి ఉన్నాయి. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ప్రాథమికంగా పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి కోణంలో పోలీసు బృందం విచారణలో నిమగ్నమైనప్పటికీ కేసు నమోదు చేస్తున్నారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

సందీప్ గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి భద్రతలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు అంతా యథావిధిగా ఉన్నట్లు బంధువుల ద్వారా తెలిసింది. సందీప్ భార్య నిషా, ఎనిమిదేళ్ల కుమార్తె అర్పితతో కూడా సంభాషించాడు. సాయంత్రం భోజనం వండమని భార్యను సందీప్ కోరాడు. అనంతరం కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఒక్కసారిగా గదిలో నుంచి కాల్పుల శబ్దం వచ్చింది.దీంతో సందీప్ భార్య అక్కడికి వెళ్లి చూడగా భర్త రక్తంతో నేలపై పడి ఉన్నాడు. భర్త ఆకస్మిక మరణంతో నిషా ఆవేదన చెందుతోంది.