Site icon HashtagU Telugu

HDFC Merger: దేశ కార్పొరేట్‌ చరిత్రలో సంచ‌ల‌నం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం..!

HDFC Credit Card

Hdfc Bank Hdfc

దేశ‌ కార్పోరేట్ చరిత్రలో మరో కీలక పరిణామం జరగనుంది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లోకి హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మోర్టగేజ్‌ రుణ సంస్థ విలీనం కానుంది. ఈ క్రమంలో తాజాగా ఇదే విషయాన్ని తమ బోర్డు సభ్యులందరూ ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అయితే ఈ విలీనానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణా సంస్థల నుంచి అనుమతి రావాల్సి ఉంది.

ఇక ఈ విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌లో విలీనం కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మధ్య విలీనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీలోని ప్రతి 25 షేర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లు ఇస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్‌ల యాజమాన్యంలో ఉంటుంది. ఈ పరిణామం నేపథ్యంలో ఈరోజు రెండు సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి.

ఇక ఈ విలీన ప్రక్రియ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. లేదంటే అదే ఫైనాన్షియల్ ఇయర్ లో రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల విలీన వార్త వెలువడిన తర్వాత ఆయా సంస్థలకు సంబంధిచిన షేర్ల ధర భారీగా పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్లు 15 శాతం మేర లాభపడ్డాయి. దీంత‌తో ఓ దశలో ఈ జంట షేర్లు 15 శాతం మేర లాభపడడం విశేషం. ఇక‌పోతే విలీనం తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే భారతదేశంలో అతిపెద్ద మూడో కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ మారనుంది.