Aryan Khan : షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కిడ్నాప్ కు కుట్ర, కుదరకపోయేసరికి డ్రగ్స్ కేసులో ఇరికించారు

  • Written By:
  • Publish Date - November 21, 2021 / 12:29 PM IST

క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్28న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును నవంబర్20న బాంబే హైకోర్టు విడుదల చేసింది.

దీనిపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ స్పందిస్తూ కోర్టు ఆర్డర్ పూర్తిగా చదివాకా ఆర్యన్ కి డ్రగ్స్ తో సంబంధం లేనట్టు, ఆయన్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోతామని కొందరు డ్రగ్స్ కేసులో ఇరికించారని స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.

ఈ కేసును మొదటి నుండి ఇది డ్రగ్స్ కేసు కాదని, ఆర్యన్ ను బీజేపీ నేత మోహిత్ కిడ్నాప్ చేయాలనే కుట్ర అని నవాబ్ మాలిక్ వాదిస్తున్నారు. ఆరోజు క్రూయిజ్ పార్టీ టికెట్ కూడా ఆర్యన్ కొనలేదని ప్రతీక్ గబా, అమిర్ ఫుర్ణింతురువాలా కలిసి ఆర్యన్ ను అక్కడికి తీసుకొచ్చారని నవాబ్ తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కూడా కిడ్నప్ ప్లాన్ లో భాగమేనని ఆరోపించారు.

ఆరోజు జరిగిన పార్టీకి పలు మంత్రుల కుమారులు వచ్చేలాగా ప్లాన్ చేశారని, తమ క్యాబినెట్ మంత్రి అస్లాం షేఖ్ ని కూడా రావాల్సిందిగా కషిఫ్ ఖాన్ ఒత్తిడి చేశారని ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలనే ప్రయత్నం చేశారని నవాబ్ ఆరోపించారు. ఒకవేళ ఆ పార్టీకి తమ మంత్రి ఆ హాజరయ్యుంటే ఉడ్తా పంజాబ్ తర్వాత ఉడ్తా మహారాష్ట్ర అయ్యేదని తెలిపారు.