Site icon HashtagU Telugu

SSC CHSL 2023 : ఇంటర్ పాస్ అయ్యారా..1600 జాబ్స్ మీకోసమే

Ssc Chsl 2023

Ssc Chsl 2023

మీరు ఇంటర్ పాస్ అయ్యారా ?  ప్రభుత్వ ఉద్యోగం కావాలా ? అయితే ఒక మంచి అవకాశం!! 1600 పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc) మే 9న రిలీజ్ చేసిన  కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (SSC CHSL 2023) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ మీకోసమే !! ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ తో , ఇతరత్రా ఎంపిక ప్రక్రియల్లో క్వాలిఫై అయితే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా జాబ్ పోస్టింగ్ పొందుతారు. 18 నుంచి 27 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ జాబ్స్ (SSC CHSL 2023)కు అప్లై చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ కేటగిరీ దరఖాస్తుదారులకు వయోపరిమితిలో కొన్ని సడలింపులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఈ జాబ్ కు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్  జూన్ 8.

ALSO READ : railway jobs 548 : ఇంటర్, ఐటీఐ చేసినోళ్లకు రైల్వే ఉద్యోగాలు

అప్లికేషన్ ప్రక్రియ ఇదీ.. 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను మీరు చూడొచ్చు. ఆన్‌లైన్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయొచ్చు. ssc.nic.in వెబ్ సైట్ లోని  homepage పై Apply Online అనే సెక్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. చివరలో దరఖాస్తు రుసుమును చెల్లించండి. ఇదంతా  పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి. దాని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి. ఆన్‌లైన్ లో  ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్  జూన్ 10.  ఆఫ్‌లైన్ లో  చలాన్ పొందడానికి లాస్ట్ డేట్ జూన్ 11. చలాన్ ద్వారా పేమెంట్ కు లాస్ట్ డేట్ జూన్ 12. దరఖాస్తు ఫారమ్ లో  కరెక్షన్స్ కోసం ఆన్‌లైన్ లో ఛార్జీల చెల్లింపునకు జూన్ 14 నుంచి 15 వరకు గడువు ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ను ” కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ టైర్ I” అంటారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ పరీక్షకు ఏడు రోజుల ముందు రిలీజ్ అవుతుంది. అప్లై చేసుకున్న వాళ్లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆగస్టు 2 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఉంటుంది.  SSC CHSL టైర్ 1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2 పరీక్షకు అర్హులు అవుతారు.