Site icon HashtagU Telugu

Chandrayaan3: శభాష్ భరత్.. ఇడ్లీలు అమ్మి, చంద్రయాన్ 3లో భాగమై!

Chandrayan3

Chandrayan3

చత్తిస్గఢ్ లో చరోడా అనే పట్టణంలో భరత్ కుమార్ అనే కుర్రాడు దేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు. అతని తండ్రి బ్యాంక్  సెక్యురిటి గార్డ్ గా పనిచేస్తున్నాడు. కానీ కొడుకు కు మంచి విద్య అందించాలి అనుకున్నాడు కానీ ఆర్థిక పరిస్థితి ,సామాజిక పరిస్థితి అనుకూలించలేదు దీంతో  తల్లి ఇడ్లీ, టీ అమ్ముతూ కుటుంబానికి అండగా ఉండేది. వీరి పట్టణం చరోడా నుండి బొగ్గును సరఫరా చేసే రైలు వెళ్తుంది..ప్లేట్ లు కడుగుతూ, టీ, ఇడ్లీలు అమ్ముతూ జీవనం సాగించాడు. భరత్ అలా చేస్తూనే ఇష్టపడి చదువుకున్నాడు.

స్కూల్ చదువు అక్కడే కేంద్రీయ విద్యాలయంలో సాగింది. అధ్యాపకుల సాయంతో భరత్ మెరిట్‌తో 12th పాస్ అయ్యాడు మరియు ఐఐటీ ధన్‌బాద్‌కు ఎంపికయ్యాడు. మళ్లీ ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు రాయ్పూర్ వ్యవస్థాపకులు అరుణ్ బాగ్ మరియు జిందాల్ గ్రూప్ భరత్‌తో కలిసి పనిచేసాయి .ఇక్కడ కూడా భరత్ తన అద్భుతమైన ప్రతిభను పరిచయం చేశాడు. 98%తో ఐఐటి ధన్‌భాద్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. భరత్ ఇంజినీరింగ్ యొక్క ఏడవ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు అక్కడ ప్లేస్‌మెంట్‌లో భరత్‌ని ఎంచుకున్నారు. భారత్ చంద్రయాన్ 3 మిషన్‌లో భాగం అయ్యాడు. యువకుడి వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం.