Cow Smuggler : హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. గోసంరక్షకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రెచ్చిపోయారు. 12వ తరగతి విద్యార్థి ఆర్యన్ మిశ్రా, అతడి స్నేహితులు శాంకీ, హర్షిత్‌లను పశువుల స్మగ్లర్లుగా గోసంరక్షకులు భావించారు. ఆర్యన్ మిశ్రా ప్రయాణిస్తున్న రెనాల్ట్ డస్టర్ కారును వారు దాదాపు 30 కిలోమీటర్లు వెంబడించారు. హర్యానాలోని ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై ఉన్న గధ్‌పురి వరకు ఈ కార్ ఛేజింగ్ కొనసాగింది. ఈక్రమంలో గోసంరక్షకులు తుపాకీతో జరిపిన కాల్పుల్లో కారులో కూర్చున్న ఆర్యన్ మిశ్రా మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అక్కడ కారు ఆగిపోయింది. కారు దగ్గరికి వెళ్లి పరిశీలించిన గోసంరక్షకులు(Cow Smuggler) తాము ఒకరికి బదులు మరొకరిపై కాల్పులు జరిపామని గుర్తించి, అక్కడి నుంచి పరారయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
రెనాల్ట్ డస్టర్ కారులో మహిళలు కూడా ఉండటంతో అది పశువుల స్మగ్లర్ల వాహనం కాదని గోసంరక్షకులు నిర్ధారణకు వచ్చారు. ఆర్యన్ మిశ్రాను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ ఒకరోజు తర్వాత చనిపోయాడు. ఈ కాల్పుల్లో గోసంరక్షకులు వినియోగించిన తుపాకీ కూడా చట్టవిరుద్ధమైనదని పోలీసులు గుర్తించారు. ఆర్యన్ మిశ్రా కారును వెంబడించి కాల్పులు జరిపిన అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరభ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెనాల్ట్ డస్టర్ కారులో పశువుల స్మగ్లర్లు వెళ్తున్నారనే సమాచారం అందడంతో తాము దాన్ని వెంబడించి కాల్పులు జరిపామని నిందితులు పోలీసులకు చెప్పారు. తాము కాల్పులు జరిపితే కారులోని స్మగ్లర్లు తిరిగి కాల్పులు జరుపుతారని భావించామని, కానీ అలా జరగకపోవడంతో కాల్పులను ఆపేశామన్నారు.ఆగస్టు 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Also Read :Sumit Antil: పారాలింపిక్స్‌లో మూడో బంగారు పతకం.. మరోసారి మెరిసిన సుమిత్
ఛేజింగ్ చేయడానికి ముందు గోసంరక్షకులు పటేల్ చౌక్ వద్ద ఆర్యన్ మిశ్రాకు చెందిన కారును ఆపమని చెప్పారు. అయితే ఆర్యన్ మిశ్రా స్నేహితుడు శాంకీకి కొందరితో గొడవలు ఉన్నాయి. బహుశా అతడి విరోధులు మర్డర్ కోసం ఎవరినైనా పంపి ఉంటారని ఆర్యన్ మిశ్రా అనుమానించాడు. అందుకే కారును ఆపేందుకు నో చెప్పాడు. అక్కడి నుంచి కారును వేగంగా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. అనంతరం గోసంరక్షకులు మరో కారులో వారిని వెంబడించడం మొదలుపెట్టారు. ఈ ఛేజింగ్ 30 కిలోమీటర్లు కంటిన్యూ అయింది. చివరకు విషాదం మిగిలింది.