Site icon HashtagU Telugu

Haryana- Jammu-Kashmir Exit Polls : హస్తందే హావ

Haryana Jammu Kashmir Exit

Haryana Jammu Kashmir Exit

తాజాగా జరిగిన జమ్మూకశ్మీర్, హర్యానా (Haryana- Jammu-Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కమలం పార్టీకి (BJP) గట్టి ఎదురుదెబ్బ తగలనున్నదని సర్వే సంస్థలు చెపుతున్నాయి. ఈ రెండు చోట్ల హస్తందే (Congress Party) హావ అని అంటున్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అంచనాలను ప్రకటించాయి. హర్యానా (Haryana) లో మొత్తం 90 ఆసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్‌ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెపుతున్నాయి. దీంతో హరియాణాలో వరుసగా మూడో దఫా అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశే ఎదురైనట్టు తెలుస్తుంది.

జమ్మూ కాశ్మీర్ (Jammu-Kashmir) విషయానికొస్తే..బీజేపీకి ఈసారి ఎదురు దెబ్బ తప్పదనే అంటున్నారు. అన్ని నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని అంటున్నాయి. ఎన్డీటీవీ, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్ ఇలా అన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ హస్తం దే విజయం అని పేర్కొన్నాయి.

‘పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌’ సంస్థ : జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ – కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు సాధించొచ్చని అంచనా వేసింది. బిజెపి కి 23-27 స్థానాలు, పీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు తెలిపింది.

కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్‌ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యం ఇస్తారని సర్వేలో కోరగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారని సర్వే సంస్థ వెల్లడించింది.

‘రిపబ్లిక్‌ మ్యాట్రిజ్‌’ సంస్థ : పీడీపీ -28, బిజెపి -25, కాంగ్రెస్‌ -12, ఎన్సీపీకి – 15, ఇతరులు -7 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది.

పీపుల్స్ పల్స్‌-సౌత్‌ఫస్ట్ : ఎన్‌సీ పార్టీకి 33 నుంచి 35 సీట్లు, కాంగ్రెస్‌కు 13 నుంచి 15 స్థానాలు , బీజేపీ 23-27, పీడీపీ పార్టీకి 7-11 సీట్లు, ఇతరులకు 4-5 స్థానాలు వస్తాయని పేర్కొంది.

దైనిక్ భాస్కర్ : కాంగ్రెస్, ఎన్‌సీ కూటమికి 34 నుంచి 40 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 20-25, పీడీపీకి 4-7, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని పేర్కొంది.

హర్యానా విషయానికి వస్తే..

పీపుల్స్‌ పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ సర్వే : కాంగ్రెస్‌ 55 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ 26, ఐఎన్‌ఎల్‌డీ 2-3, జేజేపీ 0-1, ఇతరులు 3-5 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

రిపబ్లిక్‌ మ్యాట్రిజ్: కాంగ్రెస్‌: 55-62, బీజేపీ 18-24, ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 3-6, జేజేపీ: 0-3, ఇతరులు: 2-5 చోట్ల విజయం సాధించే అవకాశముందని పేర్కొంది.

దైనిక్‌ భాస్కర్‌: కాంగ్రెస్ 44 నుంచి 54 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. బీజేపీ 15 నుంచి 19 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక చోట గెలిచే అవకాశముందని తెలిపింది. ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమి 1 నుంచి 5 చోట్ల విజయం సాధించే అవకాశముంది. జేజేపీ ఒకచోట ఇతరులు 4 నుంచి 9 చోట్ల గెలిచే అవకాశముంది.

ధ్రువ్‌ రీసర్చ్‌ సర్వే : కాంగ్రెస్‌కు 50 నుంచి 64 సీట్లు వస్తాయని పేర్కొంది . బీజేపీ 22 నుంచి 32 సీట్లకే పరిమితం కానుంది. ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమికి ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొంది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల విజయం సాధించే అవకాశముంది.

పీమార్క్ సర్వే : ఈ సర్వే 51 నుంచి 61 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించే అవకాశముందని తెలిపింది. బీజేపీ 27 నుంచి 35 స్థానాలకు, ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్‌పీ కూటమికి 3 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా వేసింది.

ఓవరాల్ గా రెండు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే మొగ్గుచూపాయి. మరి ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయి..లేదా అనేది చూడాలి.