Nayab Singh Saini: హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష(floor test)లో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) రాజీనామాతో.. అనూహ్య రీతిలో సైనీ(Saini) సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన బలపరీక్ష ఎదుర్కొన్నారు. జేజేపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ పరిసరాల్లో కనిపించారు. పార్టీ ఇచ్చిన విప్‌ను ఉల్లంఘించి కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ చేరుకున్నారు. అయితే విశ్వాస పరీక్ష మొదలైన తర్వాత ఆ ఎమ్మెల్యేలు హౌజ్ నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీబీ బద్రాలు సభను గంట పాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో అస్థిరత్వం ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్ కడియన్ తెలిపారు. విశ్వాస పరీక్షపై సీక్రెట్ బ్యాలెట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ(54) చంఢీగఢ్లోని రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. నాయబ్ సైనీతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో బీజేపీ నేతలు కన్వర్ పాల్, మూల్ చంద్ శర్మ, జై ప్రకాష్ దలాల్, బన్వారీ లాల్‌తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఖట్టర్‌కు నమస్కరించి నాయబ్ సైనీ ఆశీస్సులు తీసుకున్నారు.
read also:CM YS Jagan: సీఎం జగన్ రేపు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటన
ఇప్పటి వరకు దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ-JJPతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ, ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై విభేదాలతో జేజేపీతో పొత్తుకు బీజేపీ స్వస్తి పలికింది. జేజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది.