Floor Test : అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న హర్యానా కొత్త సీఎం

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 11:41 AM IST

 

Floor Test: హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana Chief Minister) పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(Manohar Lal Khattar) ఊహించని విధంగా రాజీనామా(resignation) చేయడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

read also: AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..!

బీజేపీ(bjp) కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీ (Nayab Saini)ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా సైనీతో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ నేపథ్యలో సైనీ నేడు బలపరీక్షను (Floor Test) ఎదుర్కోబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నూతన సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సైనీ అసెంబ్లీలో తన బలాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీకి 41 సీట్లు ఉన్నాయి. హర్యానా లోక్‌హిత్‌ పార్టీ ఎమ్మెల్యే గోపాల్‌, ఆరుగురు స్వతంత్రుల మద్దతు ఉంది. కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కొత్త ప్రభుత్వంవైపు నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

read also: PM Modi: రిషి సునాక్​కు మోడీ ఫోన్..’స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. ఇంతకాలం జన్‌నాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)తో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా సైనీతో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కన్వర్‌ పాల్‌, మూల్‌చంద్‌ శర్మ, జైప్రకాశ్‌ దలాల్‌, బన్వరీలాల్‌, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ సింగ్‌ చౌతాలా మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వానికి కేవలం ఏడు నెలల పదవీకాలమే ఉంది.