Site icon HashtagU Telugu

Haryana Elections: హర్యానా ఎన్నికల తేదీ మార్పు, అక్టోబర్ 5న ఓటింగ్

Haryana Elections

Haryana Elections

Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఇంతకు ముందు అక్టోబర్ 1న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు ఓటింగ్ అక్టోబర్ 5 న నిర్వహించబడుతుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీకి ముందు, తర్వాత సెలవుల కారణంగా ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల తేదీ మార్పుపై బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

ఓటింగ్ తేదీకి ముందు మరియు తర్వాత సుదీర్ఘ సెలవులు మరియు పండుగలు ఉన్నాయని, దీని కారణంగా ప్రజలు ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈసీకి లేఖ రాసింది. ఎన్నికల తేదీ మార్పుకు సంబంధించి ఆగస్టు 27న భారత ఎన్నికల సంఘం సమావేశం కూడా జరిగింది. అయితే అర్థరాత్రి వరకు కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత 28వ తేదీన ఓటింగ్ అక్టోబర్ 1వ తేదీన మాత్రమే ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఇప్పుడు శనివారం ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఓటింగ్ మరియు ఓట్ల లెక్కింపు తేదీని మార్చింది.

Also Read: Viral: సొంత తల్లిని దారుణంగా హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్