Site icon HashtagU Telugu

Miss Universe: ఈసారి మిస్ యూనివర్స్ మన అమ్మాయే. తన గెలుపుకి కారణం ఈ సమాధానాలే

harnaaz sandhu

harnaaz sandhu

రెండు దశాబ్దాల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం ఇండియన్ యువతి తలపై అలంకరించబడింది.

21 ఏళ్ల తర్వాత ఈ కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ సంధూ గెలుపొందారు. 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా ఇండియా నుండి లారాదత్తా ‌ టైటిల్‌ను సొంతం చేసుకోగా తాజాగా హర్నాజ్ ఈ ఘనత సాధించింది.

ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరం జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికా అందెగత్తెల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొని చివరికి మన దేశానికి చెందిన హర్నాజ్ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

విజేతగా నిలిచిన హర్నాజ్ సంధూకు గతేడాది మిస్ యూనివర్స్ అండ్రాయి మెజా కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో పర్వాగేకి చెందిన నాడియా ఫెర్రెరా ఫస్ట్ రన్నరప్‌గానూ, దక్షిణాఫ్రికాకు చెందిన లలీలా స్వానే సెకండ్ రన్నరప్‌గానూ నిలిచారు.

పోటీలో భాగంగా కొన్ని రౌండ్లలో హర్నాజ్ చెప్పిన సమాధానాలు అద్భుతంగా ఉన్నాయని న్యాయనిర్ణేతలు తెలిపారు.

నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి తమను తాము నమ్మకపోవడమేనని, తనని తాను నమ్ముకున్నాను కాబట్టే ఇక్కడ నిలబడి ఉన్నానని హర్నాజ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారని తెలుసుకోవడం వారిని మరింత అందంగా చేస్తుందని, ఇతరులతో పోల్చుకోవడం మానేయాలని హర్నాజ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

మీకోసమే మాట్లాడుకోవడం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంశాలపై మన గొంతును వినిపించాలని ఆమె మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

‘ప్రకృతి ఎదుర్కొంటున్న చాలా సమస్యలు చూసి తన గుండె పగిలిపోతుందని, మన బాధ్యతారహిత ప్రవర్తన వల్లే ఇదంతా జరిగింది. తప్పు జరిగాక బాధపడడం కంటే తప్పు జరగకుండా చూడడమే సరైన విధానమని మరో ప్రశ్నకు హర్నాజ్ సమాధానమిచ్చారు.

https://twitter.com/MissUniverse/status/1470227063789563907

Exit mobile version