Site icon HashtagU Telugu

Hardik Patel: పంజాబ్ సర్కారుపై విరుచుకుపడ్డ హార్దిల్ పటేల్ .. కాషాయ కండువా కప్పుకోకముందే…!

Hardik Imresizer

Hardik Imresizer

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ పీసీసీ చీఫ్ హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టే ఉంది. కానీ ఆయన నేరుగా ఆ విషయాన్ని చెప్పడం లేదు. ఏదైనా ఉంటే మీకు చెబుతాను కదా అని మీడియాను ఉద్దేశించి అన్నారు. ఆయన కమళ తీర్థం పుచ్చుకుని కాషాయదళంలో సభ్యుడు అవుతారని.. గుజరాత్ లో కానీ బీజేపీ మళ్లీ గెలిస్తే.. ఆయనను ముఖ్యమంత్రి కూడా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పుడు హార్దిక్ పటేల్ తన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలపై నా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్ పై ఆయన ఫోకస్ పెట్టారు. అక్కడ పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్యకు సంబంధించి ఆప్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాలు అస్తవ్యస్త పాలన చేస్తే.. ఇలాంటి విషాదాలు తప్పని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. కొన్నాళ్ల కిందట అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడిని దారుణంగా హత్య చేశారని.. ఇప్పుడు యువకళాకారుడును కాల్చి చంపారని అన్నారు. ఇలాంటి ఘటనలు భద్రతను ప్రశ్నిస్తాయన్నారు.

పంజాబ్ సీఎంతోపాటు ఢిల్లీ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయా అని ప్రశ్నించారు. పంజాబ్ ను బాధపెట్టేలా కాంగ్రెస్ లాగే ఆప్ కూడా మారాలనుకుంటోందా అని విమర్శించారు. గుజరాత్ లో పటీదార్ ఉద్యమ నాయకుడిగా పేరు గడించిన హార్దిక్ పటేల్ కు కాంగ్రెస్ అగ్రపీఠమే ఇచ్చినా.. ఆయన మాత్రం ఎన్నికల ముందు పార్టీ మారుతుండడంపై ఊహాగానాలు ఆగడం లేదు.