Site icon HashtagU Telugu

Harbhajan Singh : కోల్‌‌కతా ఘటనపై హర్భజన్‌సింగ్ ఆగ్రహం.. దీదీకి, గవర్నర్‌కు బహిరంగ లేఖ

Harbhajan Singh Call For Justice

Harbhajan Singh : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ హర్భజన్ సింగ్ స్పందించారు.  హత్యాచార బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్,  దేశ ప్రజలకు ఆయన ఒక  బహిరంగ లేఖ రాశారు. జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఆగస్టు 9న వెలుగుచూడగా.. ఇంకా వారి కుటుంబానికి న్యాయం జరగకపోవడంపై హర్భజన్(Harbhajan Singh) ఆవేదన వెలిబుచ్చారు.  అందరూ ఆత్మ పరిశీలన చేసుకొని ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘కోల‌్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం గురించి మాటల్లో చెప్పుకోలేం. అది తీవ్రమైన నేరం మాత్రమే కాదు.. మన దేశంలోని మహిళల ఔన్నత్యం, ఆత్మగౌరవంపై జరిగిన దాడి. మన సమాజంలోని మూలాల్లో దాగిన కొన్ని అంశాలు కూడా ఇలాంటి ఘటనలకు కారణం. ఇలాంటి అంశాల్లో ప్రక్షాళన అవసరం. సంబంధిత విభాగాలు చర్యలు చేసుకోవాలి. దోషులను కఠినంగా శిక్షించాలి’’ అని కోరుతూ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Also Read :AI Human Robot : సరిహద్దుల్లో శత్రువుల భరతం పట్టే ఏఐ రోబో రెడీ

‘‘ఆస్పత్రి అంటే ప్రజల ప్రాణాలు కాపాడే చోటు. అలాంటి ప్రదేశంలో ఏకంగా డాక్టర్‌పైనే ఇలాంటి దురాగతం చోటుచేసుకోవడం దారుణం. ఎంతో దిగ్భ్రాంతికర ఘటన ఇది’’ అని హర్భజన్ సింగ్ తెలిపారు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టనందు వల్లే వైద్యులు, వైద్య సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాయని ఆయన చెప్పారు.  వైద్యుల నిరసనలకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.  భద్రత ప్రశ్నార్ధకంగా మారిన ప్రస్తుత పరిస్థితులలో డాక్టర్లు ఆస్పత్రుల్లో ప్రశాంతంగా, ఏకాగ్రతతో విధులు ఎలా నిర్వర్తించగలుగుతారు అని హర్భజన్ ప్రశ్నించారు.  వైద్యుల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందన్నారు.

Also Read :Champai Soren : ఆరుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చంపై సోరెన్.. బీజేపీలో చేరుతారా ?