Harbhajan: ఆప్ ఆఫర్.. రాజ్యసభకు భజ్జీ!

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని

Published By: HashtagU Telugu Desk
Bajji

Bajji

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం పంజాబ్ నుండి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ఆఫ్ స్పిన్నర్‌కు జలంధర్‌లోని కొత్త స్పోర్ట్స్ యూనివర్శిటీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి. గత నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మిస్టర్ మాన్ దీనిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తానని కొత్త ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భజ్జీ రాజ్యసభ సభ్యుడిగా మారినట్లయితే.. సింగ్, సచిన్ టెండూల్కర్ లాంటివాళ్లు ఎంపీలుగా పనిచేసిన మాజీ క్రీడాకారుల జాబితాలోకి చోటు దక్కనుంది. ఢిల్లీలో ఆప్ అధికార కాంగ్రెస్‌ను చిత్తు చేసి తొలిసారి పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్‌కి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అయినందున అన్ని అధికారాలు లేవు. పంజాబ్‌లో కొత్తగా ఆప్ ప్రభుత్వం ఏర్పాటుచేసినందున, పోలీసు శాఖను తన ఆధీనంలో తీసుకుంది.

  Last Updated: 17 Mar 2022, 09:25 PM IST