Site icon HashtagU Telugu

Encounter Fears : నన్ను, నా కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తారేమో.. ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు

Encounter Fears

Encounter Fears

Encounter Fears : ఫేక్ బర్త్ సర్టిఫికెట్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా రాంపూర్ జైలులో ఉన్నారు. తాజాగా ఆజంఖాన్‌‌ను  సీతాపుర్‌ జిల్లా జైలుకు.. ఆయన కుమారుడిని హర్దౌ జిల్లా జైలుకు వేర్వేరు వాహనాల్లో తరలించారు. ఈక్రమంలో రామ్‌పుర్‌ జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన టైంలో ఆజం ఖాన్‌ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘మమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేస్తారేమో..నాకు, నా కొడుకుకు ఏదైనా జరగొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. రాంపూర్  జైలు నుంచి ఇతర జైళ్లకు తరలించే క్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.ఇటీవల యూపీలో ఇదేవిధంగా జైళ్ల నుంచి తరలించే క్రమంలో పలు ఎన్ కౌంటర్లు జరిగాయి. బహుశా ఆ ఘటనలతో ఏర్పడిన భయంతోనే ఆజంఖాన్ తాజా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక  సీతాపుర్‌ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో వాహనం వెనుక సీట్లో కూర్చోవాలని ఆజం ఖాన్‌ను పోలీసులు అడిగారు. అందుకు నిరాకరించిన ఆయన.. వెన్నునొప్పి కారణంగా మధ్యలో కూర్చోలేనని, కిటికీ ఉన్న సీట్లో కూర్చుంటానని (Encounter Fears) చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

తప్పుడు బర్త్ సర్టిఫికెట్ కేసులో సమాజ్‌వాదీ సీనియర్‌ నేత ఆజం ఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఖాన్‌లతోపాటు భార్య తజీన్‌ ఫాతిమాలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు దోషిగా తేల్చింది. ముగ్గురుకి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.15వేల జరిమానా విధించింది. దీంతో వీరిని ఇటీవలే రాంపూర్ జైలుకు తరలించారు. తండ్రీ, కుమారుడిని ఆదివారం ఉదయం 4.40గంటలకు బయటకు తీసుకురాగా.. సుమారు 9గంటల ప్రాంతంలో వేరే జైళ్లకు తరలించారు. ఇతరత్రా  కేసుల వ్యవహారంలో ఆజంఖాన్ అంతకుముందు రెండేళ్ల నుంచే సీతాపుర్‌ జైల్లో ఉంటున్నారు. సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో 2022 మేలో విడుదలయ్యారు. తాజాగా నకిలీ బర్త్ సర్టిఫికెట్  కేసులో ఏడేళ్ల శిక్ష పడటంతో ఆయన్ను మళ్లీ జైలుకు తరలించారు.ఇదే కేసులో ఆజం ఖాన్‌ భార్య తజిన్‌ ఫాత్మా రాంపూర్‌ జైలులోనే ఉండనున్నారు.