Anand Mahindra: ఆయన స్పందించి ఉంటే.. సత్యం స్కాంపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

ఎప్పుడు ఒక కొత్త టెక్నాలజీతోనే కొత్త విషయంతోనో ట్వీట్స్‌ చేసే మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. ఐటి రంగంలో ఒక వెలుగు వెలిగిన సాప్ట్‌ వేర్‌ కంపెనీ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. ఆ రోజు.. నిజంగా అలా జరిగిఉంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగి ఉండేది కాదేమోనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Written By:
  • Updated On - January 22, 2023 / 11:57 AM IST

ఎప్పుడు ఒక కొత్త టెక్నాలజీతోనే కొత్త విషయంతోనో ట్వీట్స్‌ చేసే మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. ఐటి రంగంలో ఒక వెలుగు వెలిగిన సాప్ట్‌ వేర్‌ కంపెనీ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. ఆ రోజు.. నిజంగా అలా జరిగిఉంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగి ఉండేది కాదేమోనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐటి చరిత్రలో ఒక మరకలా మిగిలిపోయిన ఆ సాప్ట్‌వేర్‌ కంపెనీ ఎందుకు అలా అయ్యిందో ఆయన చెప్పకనే చెప్పారు. ఇంతకీ ఆ సాప్ట్‌వేర్‌ కంపెనీ ఏది ? ఎందుకు.. ఆనంద్‌ మహీంద్రా మరోసారి ఆ కంపెనీ గురించి ప్రస్తావించారు.

మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా ఎప్పుడు కొత్త విషయాలగురించి తన సబ్‌స్రైబర్స్‌కు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. కానీ ఈ సారి ఐటి రంగంలో ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయిన ఒక టాప్‌ దిగ్గజ కంపెనీ కొనుగోలుకు సంబంధించి తను పంచుకున్నారు. యస్‌… ఆ కంపెనీయే సత్యం కంప్యూటరస్‌ సర్వీసెస్‌…ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ సాప్ట్‌వేర్‌ కంపెనీ చివరకు దాని పేరు కూడా కనపడకుండా మాయం అయిపోయింది. సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ను విలీనానికి సంబంధించి టెక్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కీలక విషయాలు పంచుకున్నారు

సత్యం కుంభకోణం వెలుగులోకి రాకముందు ఏడాదే.. ఆ కంపెనీని కొనుగోలు చేయడానికి అప్పటి సత్యం ఛైర్మన్‌ రామలింగరాజును సంప్రదించినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు సత్యంను విలీనం చేసుకోవడానికి సైతం ఉత్సాహం చూపినప్పటికీ అపుడు ఆయన స్పందించలేదని మహీంద్రా అన్నారు. ఆ కంపెనీ ఖాతాల్లో పొరబాట్లు రామలింగరాజుకు ముందే తెలుసు కాబట్టే ఆయన స్పందించలేదేమో అనే భావనను వ్యక్తపరిచారు ఆనంద్‌ మహీంద్రా. అప్పటి దాకా సాప్ట్‌వేర్‌ రంగంలో తిరగులేని కంపెనీగా ఎదిగిన సత్యం కంప్యూటర్స్‌.. ఒక్కసారిగా స్కాంతో న్యూస్‌లోకి ఎక్కింది.

Also Read: Hyderabad : హైద‌రాబాద్‌లో జోరుగా నిషేధిత ఈ సిగిరేట్లు విక్ర‌యం.. ఇద్ద‌ర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

5 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఎక్స్ఛేంజీలకు రామలింగరాజు లేఖ రాయడం మొదలుకుని.. సత్యం కంప్యూటర్స్‌ను విలీనం చేసేందుకు, టెక్‌ మహీంద్రాను ప్రభుత్వ బోర్డు ఎంపిక చేసినంత వరకు జరిగిన 100 రోజుల ప్రయాణంపై రాసిన పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంలో రామలింగరాజు కీలక పాత్ర పోషించారు. అలా ఆయన నాకు బాగా తెలుసు. ఆ చనువుతోనే టెక్‌ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్‌ విలీన ఆఫర్‌తో ఆయన ముందుకు వెళ్లాను అని అన్నారు. అప్పటికే టెక్‌ మహీంద్రా ఆదాయం 1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నప్పటికీ సత్యంనూ కలుపుకుంటే మరింత పెద్ద సంస్థగా మారుతుందన్న ఆలోచనతో ఆ ప్రతిపాదన చేసినట్లుగా ఆనంద్ మహీంద్రా తెలిపారు.

సరిగ్గా ఇది జరిగిన తరువాత ఏడాదికి సత్యంలో కుంభకోణం బయటపడింది. సత్యం అమ్మకం సమయంలో, కుంభకోణం అనంతరం ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా ఎల్‌ అండ్‌ టీ మినహా ఏ కంపెనీ కూడా మహీంద్రాకు పోటీగా నిలువలేదు. చివరకు ఎల్‌ అండ్‌ టీ ఒక్కో షేర్‌కు 45.90బిడ్‌తో పోలిస్తే టెక్ మహీంద్రా ఒక్కో షేర్‌కు 58 రూపాయల బిడ్‌ వేసి సత్యంను సొంతం చేసుకుంది టెక్ మహీంద్రా. దీంతో అప్పటి దాకా నెలకొని ఉన్న సందేహాలకు చెక్‌ చెప్పినట్లైంది. మూతపడుతుందనుకున్న సత్యం కంటప్యూటర్‌కు జీవం పోసినట్లైంది.