Site icon HashtagU Telugu

Haryana : బ‌హిరంగ ప్రార్థ‌న‌ల నిషేధం

Lal Khattar

Lal Khattar

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్రార్థ‌న‌ల‌ను నిషేధిస్తూ హ‌ర్యానా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏ మ‌తం వారు అయిన‌ప్ప‌టికీ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎలాంటి ప్రార్థ‌న‌లు, పూజ‌లు త‌దిత‌ర మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి లేద‌ని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. కేవ‌లం పండ‌గలు, వార్షికోత్స‌వాలు ఇత‌ర‌త్రా ముఖ్య‌మైన రోజుల్లో ప్ర‌త్యేక అనుమ‌తుల‌తో మాత్ర‌మే బ‌హిరంగ ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి ఉంటుంది. మిగిలిన రోజుల్లో బ‌హిరంగ ప్రార్థ‌న‌ల‌కు చెక్ పెడుతూ హ‌ర్యానా ప్ర‌భుత్వం సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకుంది. ఆ మేర‌కు సీఎం మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ మీడియాకు వెల్ల‌డించాడు.గ‌తంలో ప్ర‌భుత్వం నిర్దేశించిన కొన్ని ప్రాంతాల్లో బ‌హిరంగంగా ముస్లింలు ప్రార్థ‌న‌లు చేస్తుండే వాళ్లు. ప్ర‌త్యేక గురుగ్రామ్ లోని వివిధ ప్ర‌దేశాల్లో బ‌హిరంగ న‌మాజ్ ఉండేది. ప్ర‌త్యేకించి శుక్ర‌వారం రోజున జ‌రుగుతోన్న బ‌హిరంగ న‌మాజ్ పై హిందూ గ్రూపులు అభ్యంత‌ర పెట్ట‌డంతో ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలకు ప్ర‌త్యేకంగా ప్రార్థనలు చేయ‌డానికి ప్ర‌దేశాలు ఉన్నాయి. పండుగలు ఇత‌ర కార్యక్రమాలను” నిర్వహించడానికి నిర్దిష్ట అనుమతులు ఉన్నాయ‌ని సీఎం ఖ‌ట్ట‌ర్ అన్నాడు. ఏ మ‌తం మ‌రో మ‌తం వాళ్ల మ‌నోభావాల‌ను రెచ్చగొట్టే బలప్రదర్శన చేయ‌డానికి వీల్లేద‌ని ఖ‌ట్ట‌ర్ తెగేసి చెప్పాడ‌. రోజువారీ లేదా వారానికోసారి జ‌రిగే ప్రార్థ‌న‌ల‌కు ప్ర‌త్యేకంగా ఉండే స్థలాల్లో మాత్ర‌మే చేయాల‌ని హ‌ర్యాన ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Exit mobile version