Site icon HashtagU Telugu

Gulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి షాక్…ఆ పదవికి రాజీనామా చేసిన సీనియర్ లీడర్..!!

Ghulam nabi azad

Ghulam nabi azad

కాంగ్రెస్ కు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్. చాలా కాలం నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పై అజాద్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ట్రబుల్ షూటర్ గా ఉన్న అజాద్…పార్టీల మార్పుల కోసం పట్టుబడుతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ కు సంబంధించి అజాద్ కు కీలక బాధ్యతలను అప్పగించారు. అయితే బాధ్యతలను అప్పగించిన కొద్దిసేపట్లోనే ఆయన రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా పార్టీ హైకమాండ్ ఆయన్ను నియమించింది. గంటల వ్యవధిలోనే రాజీనామా చేశారు. అంతేకాదు జమ్మూ కశ్మీర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ రాజీనామా చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకిచ్చినట్లు చెప్పవచ్చు.

కాగా ఆలిండియా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న తనను జమ్మూ కశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించడం పట్ల ఆజాద్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నియామాకాన్ని ఆయన డిమోషన్ గా భావించారని సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో తన హోదాను తగ్గించారని ఆజాద్ గుస్సగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బాధ్యతల నుంచి తప్పుకున్నారని సమాచారం. కాగా అనారోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొనడం గమనార్హం .

Exit mobile version