Site icon HashtagU Telugu

Gujarat: మోర్బీ ప్రమాదంలో 141 చేరిన మృతుల సంఖ్య,177మంది రక్షించిన NDRF..!

Morbi

Morbi

గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 141 మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. 177మందిని రక్షించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించాను. ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై పెద్దెత్తున జనం ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో స్థానికులు పోలీసులకు సహాయం చేస్తున్నారు. ఎన్ డిఆర్ఎఫ్, ఎస్ డిఆర్ఎఫ్ లకు చెందిన మూడు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి వైమానిక దళం గరుడ్ కమాండోలను ఘటనాస్థలానికి పంపించింది.

ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు, గాయపడినవారికి 50వేల చొప్పున పీఎం రిలీఫ్ పండ్ నుంచి మోదీ పరిహారంగా ప్రకటించారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. మరణించినవారి కుటుంబాలకు నాలుగు లక్షలు, గాయపడిన వారికి 50వేలు అందజేస్తామని ప్రకటించింది.