Site icon HashtagU Telugu

Gujarat : మోర్బిలో ప్రధాని పర్యటన. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆసుపత్రికి రంగులు..!!

Morbi Hospital (1)

Morbi Hospital (1)

గుజరాత్ లోని మోర్బిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు మోదీ. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీ సివిల్ ఆసుపత్రిలో మరమ్మత్తులు చేపట్టారు అధికారులు. ఆసుపత్రికి రంగులు వేశారు. తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ఆసుపత్రిలో మరమ్మత్తులు చేపట్టారని కాంగ్రెస్, ఆప్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఆప్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆసుపత్రికి రంగులు వేస్తున్న వీడియోను జోడించారు. కేబుల్ బ్రిడ్జి కూలి 141 మంది మరణించారు. వందలాది మంది తప్పిపోయారు. అసలు దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ బీజేపీ కార్యకర్తలు ఫోటో షూట్ కు సిద్ధమయ్యే పనిలో నిమగ్నమయ్యారంటూ విమర్శించారు.

కాంగ్రెస్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. కొత్త టైల్స్ మార్చారు. వారికి సిగ్గులేదా, చాలా మంది మరణించారు. ఇదేమైన శుభకార్యమా ఏర్పాట్లు చేయడానికి అంటూ తిట్టిపోసింది. గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ…మోర్బీలోని సివిల్ ఆసుపత్రిలో పెయింటింగ్ డెకరేషన్ పనులు జరుగుతున్నాయి. బీజేపీకి కేవలం ఈవెంట్ మేనేజ్ మెంట్ మాత్రమే తెలుసునని రెండు రకాల విపత్తులు ఉన్నాయని…అయితే గుజరాత్ లో బీజేపీ మూడవ రకం విపత్తు. పెయింటింగ్ అలంకరణలు పక్కన పెట్టి రోగులకు సరైన వైద్యం అందేలా చూడండి అంటూ విమర్శించారు.

Exit mobile version